More

  కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటమి తప్పలేదనే ఫ్రస్ట్రేషనా..?

  హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయంతో… నిరాశ..నిస్పృహనా..? లేక కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటమి తప్పలేదనే ప్రస్టేషనా? ఏంటో తెలియదు కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర బీజేపీ నాయకులే టార్గెట్ గా గత రెండు రోజుల నుంచి విరుచుకుపడుతున్నారు.
  ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా అంతే స్థాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ ధర్మపురి కూడా తమదైన మాటలతో ఎదురుదాడి చేస్తున్నారు.
  అయితే కేసీఆర్ ఆదివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో దేశ సరిహద్దుల అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. పాకిస్తాన్, చైనాలను చూపి బీజేపీకి వాళ్ళు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోచైనా వాళ్ళు భగాయించారని.., వాళ్ల ముందు మన వాళ్లు తోకముడిచారని, సరిహద్దుల్లో చైనా వాడు.., ఊర్లకు ఊర్లేకడుతున్నారని.., సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చైనావాళ్లు ముందు తోకముడిచారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు భారత సైన్యాన్ని అవమానించడమేనని…దీనికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
  అయితే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్ ధర్మపురి ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిందో లేదో…! సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించిన అంశాలనే మళ్లీ మరింత ఘాటుగా ప్రస్తావించాడు.
  చైనా ముందు తోకమూడిచారు అంటూ తాను చేసిన కామెంటుపై విమర్శలు వెల్లువెత్తడంతో…, సోమవారం దీనిపై కాసింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్.! చైనా సరిహద్దుల్లో ఆక్రమణకు గురవుతున్న, భారత భూభాగాలను కాపాడాలనే తాను చెప్పానని.., దీనికి తనను బీజేపీ నాయకులు దేశ ద్రోహి అంటూ ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.
  అయితే అసలు దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతోందో సీఎం కేసీఆర్ కు తెలియదా? లేక సీఎం కేసీఆర్ కు ఇన్ పుట్ అందించేవారే ఆయన్ను మిస్ లీడ్ చేశారా? సీఎం కేసీఆర్ అరుణాచల్ ప్రదేశ్ లో చైనా గ్రామాలను నిర్మిస్తోందని ప్రస్తావించడం వెనుక అసలు ఏం జరిగింది? నిజంగానే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే , అరుణాచల్ ప్రదేశ్ లోకి చొచ్చుకుని వచ్చి మరి చైనా గ్రామాలను నిర్మిస్తోందా? చైనా ఎక్కడైతే గ్రామాన్ని నిర్మించిందో.., అంతకు ముందు నుంచే 60 ఏళ్ళకు పైగా.., ఆ భూభాగం అంతా కూడా చైనా కంట్రోల్నే ఉందా? దీనిపై స్వయంగా అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ, అలాగే కేంద్రమంత్రి కూడా అయిన కిరణ్ రిజుజ్ ఏమన్నారు? కావాలనే మన దేశంలోని కొన్ని లెఫ్ట్ మీడియా హౌసులు సరిహద్దుల్లో భద్రతకు సంబంధించి, తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయా?ఈ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
  భారత్, చైనా LAC సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు నెలకన్నాయాని.., డ్రాగన్.. భారత్ సరిహద్దుల వెంబడి దురాక్రమణలకు పాల్పడుతోందని అమెరికా రక్షణ శాఖ గత వారం తమ దేశ పార్లమెంటుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొనడం జరిగింది. సరిహద్దుల్లో సైనిక సామర్థ్యం పెంచుకోవటంతో సహా, బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని LAC వెంబడి, చైనా… పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
  అమెరికా రక్షణ శాఖ నివేదికను ఆధారం చేసుకుని మన దేశంలోని కొన్ని లెఫ్ట్ మీడియా హౌసులు , లెఫ్ట్ లిబరల్ మేధావులు, కుహనా లౌకికవాదులు, కాంగ్రెస్ నేతలు అదే పనిగా తమదైన కథనాలను వండివార్చడం మొదలు పెట్టారు.
  అలాగే అరుణాచల్ లో చైనా డ్రాగన్ గ్రామాలను నిర్మిస్తోందని తాము ముందే చెప్పామని ఎన్డీటీవీ చెప్పుకొచ్చింది. ఈ వార్తను ఎన్డీటీవీ ఈ ఏడాది జనవరిలో ప్రసారం చేసింది. ఎన్టీటీవీ ప్రసారం చేసిన ఈ న్యూస్ ను బేస్ చేసుకుని… దేశంలోని కొన్ని ప్రొ లెఫ్ట్ మీడియా హౌసులు, అలాగే ప్రాంతీయ మీడియా చానళ్లు, పత్రికలు అరుణాచల్ ప్రదేశ్ లోకి చైనా సైన్యం చొచ్చుకుని వచ్చి మరి గ్రామాలను నిర్మిస్తోంది.., భారత సైన్యం, భారత ప్రభుత్వం ఏమి చేస్తోందంటూ…? అర్థం వచ్చేలా..? ఇంకా చెప్పాలంటే.. ప్రధానిగా నరేంద్రమోదీ విఫలమయ్యారనే విధంగా… దేశ ప్రజలను కన్ఫ్యూజన్ కు గురి చేసేలా… హెడ్డింగులతో కథనాలను ప్రసారం చేయడం జరిగింది.
  అయితే అదే సమయంలో… ఎన్డీటీవీ ప్రసారం చేసిన ఈ కథనం పూర్తిగా కల్పితమని, భారత ప్రజలను కన్ఫ్యూజన్ కు గురిచేసేలా లెఫ్ట్ మీడియా హౌస్ లు నకిలీ వార్తలను సృష్టిస్తున్నాయని… ఓపీ ఇండియా అనే వెబ్ పోర్టల్ ఈ జాతి వ్యతిరేక శక్తుల బండారాన్ని బయటపెట్టింది.
  NDTV ప్రసారం చేసిన కథనంలో 2019 ఆగస్టులో ఆ ప్రాంతంలో విలేజ్ లేదని.., ఇప్పుడు కొత్తగా నిర్మిచిందని చెప్పింది. అయితే ఆ కథనంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.., చైనా ఏదైతే నూతన గ్రామాన్ని నిర్మించిందని చెబుతున్నారో… ఆ ప్రాంతం గత ఆరు దశబ్దాలుగా ఎవరి ఆధీనంలో ఉందనే విషయాన్ని మాత్రం సదరు చానల్ బయటపెట్టలేదన్నది నిప్పులాంటి నిజం.
  2020 నవంబర్ లో తీసిన ఉపగ్రహ చిత్రంలో అరుణాచల్ ప్రదేశ్ లోని ఎగువ సుభాన్ సిరి జిల్లాలోని సారి నదికి ఆవల ఒడ్డున చైనా ఈ గ్రామాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. 2019 ఆగస్టులో తీసిన ఉప గ్రహ చిత్రాల్లో ఈ గ్రామం లేదు. చైనా సైనిక శిబిరానికి కొద్దిదూరంలోనే 2020లోనే ఈ గ్రామం నిర్మించడం జరిగిందని చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఎవరు నివాసం ఉండటం లేదని తెలుస్తోంది.
  ఈ ప్రాంతం కోసం భారత్, చైనాల మధ్య గతంలో ఒకసారి యుద్ధం కూడా జరిగింది. లాంగ్జు సంఘటనగా పిలిచే ఓ ఆపరేషన్ లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ… ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుందని కొంతమంది రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. దీంతో 1959 నుంచి కూడా ఈ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉండిపోయింది. ఆ సమయంలో గ్రేట్ కాంగ్రెస్ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రధానిగా ఉన్నారనే విషయం దేశ ప్రజలు మర్చిపోరాదు.
  నెగటివ్ నెరెటిలో NDTV ప్రసారం చేసిన ఈ కథనంపై స్వయంగా అరుణచల్ ప్రదేశ్ ఎంపీ.. ఇంకా కేంద్రమంత్రి కూడా అయిన కిరణ్ రిజుక్ స్పందించడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే భారత సైనిక దళాల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. భారత దేశాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించే శీర్షికతో.. ఉద్దేశపూర్వకంగానే.. NDTV ఈ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని కిరణ్ రిజుజు ట్వీట్ కూడా చేయడం జరిగింది.
  అంతేకాదు.. 2013లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి రక్షణ మంత్రి గా ఎకె అంటోనీ పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని కూడా తన ట్వీట్ కు జత పరిచాడు కిరణ్ రిజుజు.!
  చైనా తో భారత్ కున్న సరిహద్దుల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా ఉండటమే ఉత్తమ రక్షణ విధంగా ఆరోజుల్లో ఉండేదని.., చాలా ఏళ్ళపాటు అన్ని ప్రభుత్వాలు ఇదే పాలసీని అనుసరించాయన్నారు ఏకే ఆంటోనీ.! అయితే అదే సమయంలో చైనా సరిహద్దుల వెంట మౌలిక సదుపాయలను అభివృద్ధి చేస్తున్నా కూడా మన ప్రభుత్వాలు చోద్యం చూస్తు ఉండిపోయాయే తప్ప.. సరిహద్దులను పట్టించుకోలేదని అంటోనీ తన ప్రసంగంలో తెలిపిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి.!
  1959 నుంచి సరిహద్దుల్లో చొరబాట్లకు పాల్పడుతు వచ్చిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనంతర కాలంలో 1962లో భారతపై ఏకపక్షంగా యుద్ధానికి దిగింది. అయితే చైనా విషయంలో జాగ్రత్తా ఉండాలంటూ సర్దార్ పటేల్ చెప్పిన మాటలను సోషలిజం మాయలోపడినా నెహ్రూ.. పెడచెవిన పెట్టారు.! చైనాను గుడ్డిగా నమ్మకారు. హిందీ-చీనీ భాయ్ అంటూ చైనాతో పంచశీల ఒప్పందం చేసుకున్నారు. స్వతంత్రదేశమైన టిబెట్ ను కమ్యూనిస్టు చైనా అన్యాయంగా ఆక్రమించుకుంటున్నా… ప్రధాని నెహ్రూ మాత్రం చూస్తూ ఉండిపోయాడు. ఇక అప్పటి నుంచి భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తూనే ఉందనే విషయం మనం మర్చిపోరాదు.
  అయితే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..చైనా తూర్పు లద్దాక్ లోని భారత భూభాగాలను కబ్జా చేసేందుకు యత్నించింది. గత ఏడాది జూన్ లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ముఖిమూఖిపోరాటం కూడా జరిగింది. ఈ పోరాటలో 21 మంది భారత సైనికులు అమరులయ్యారు. 43 మందికి పైగా చైనా సైనికులు సైతం భారత సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కూడా ఉద్రికత్తలు తగ్గలేదు. తూర్పు లద్దాక్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద రెండు దేశాల సైనికుల మోహరింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
  బరితెగించిన కబ్జా కోర్… చైనా విషయంలో మోదీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సైనికపరంగా జవాబు ఇవ్వడమేకాకుండా…, ఇటు ఆర్థికంగా సైతం చైనాను చావుదెబ్బతీసేందుకు చర్యలు తీసుకుంది. భారత్ లోని చైనా కంపెనీల యాప్ లను నిషేధించింది. అనుమానాస్పదంగా వ్యవహారిస్తున్న చైనా కంపెనీలపై సైతం కఠిన ఆంక్షలు విధించింది.
  ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఖంగుతిన్న.. చైనా చర్చించుకుందామని ప్రతిపాదనలు పంపిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికి 13 సార్లు కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. పెంగాంగ్ లేక్ తో పలు ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనక్కి వెల్లింది. బ్లాక్ టాప్, తోపాటు కైలాష్ రేంజ్ లోని కీలక పర్వతాలపై భారత సైన్యం పట్టుబిగిచండంతో చైనా ఇప్పుడు డిఫెన్స్ పడింది.
  తూర్పు లద్దాఖ్ లో కూడా చైనాకు దీటుగా జవాబు ఇవ్వడం వంటి చర్యలతో పీఎం మోదీ గ్రాఫ్ భారత్ ప్రజల్లో మరింత పెరిగిపోయింది. అది చెక్కుచెదరకుండా ఉందన్నది నిప్పులాంటి నిజం.
  దీంతో ప్రజల్లో ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న నమ్మకాన్ని తొలగించాలనే ఏకైక అజెండగా మన దేశంలోని లెఫ్ట్ లిబరల్ మేధావులు, కుహనా లౌకికవాదులు, కాంగ్రెస్ వాదులు, కమ్యూనిస్టులు, ఇంకా చైనాకు వంతపాడే కొన్ని జాతీయ చానళ్లు.., అదేపనిగా తమదైన కథనాలతో దేశప్రజల్లో ప్రధాని మోదీ విఫలమయ్యారనే విధంగా వారిలో భ్రమలు వ్యాపింప చేస్తున్నారు.
  వెదర్ ఆర్ కన్వె…, ఆర్ కన్ఫ్యూజ్ దేమ్ అనే కుటిల సూత్రాన్ని అమలు చేస్తున్నారు.
  సోషల్ మీడియా మాద్యమంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అయితే ట్వీటర్ లో పీఎం మోదీని, భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్నారు. మోదీ హయంలోనే చైనా…, భారత భూభాగాన్ని ఆక్రమిచుకుందనే అర్థం వచ్చే రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
  కానీ.. అదే సమయంలో తన ముత్తాత నెహ్రూ , అలాగే తన తండ్రి రాజీవ్ గాంధీ , ఇంకా తన తల్లి సోనియా ఛైర్ పర్సన్ గా ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నప్పుడూ…, చైనా బలగాలు… భారత భూభాగాలను ఆక్రమించుకున్న విషయాన్ని మాత్రం రాహుల్ మార్చిపోయారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజ్…, రాహుల్ పై కౌంటర్ అటాక్ చేశారు.
  అటు 1980లోనే చైనా… సరిహద్దు ప్రాంతాలైనా లాంగ్జూ నుంచి మజా వరకు రోడ్డు వేసిందని.., తవాంగ్ వ్యాలీని ఆక్రమించుకుందని.., ఆ సమయంలో భారత ఆర్మీ సైనిక ఆపరేషన్ చేపట్టి ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేసిందని.., అయితే ఆనాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ అందుకు అనుమతించలేదని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ తాపిర్ గవో ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.
  2017 నుంచే…ఇండో, టిబెటన్ సరిహద్దుల్లో నూతన గ్రామాలను నిర్మించేందుకు చైనా పెద్దఎత్తున ప్రణాళికలు రూపొందించింది. చైనా అధ్యక్షుడు షి జింగ్ పింగ్ ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్రా వేశారని…, ఈ మధ్యనే ఆయా ప్రాంతాల్లో రహస్య పర్యటన కూడా జరిపారని చెబుతున్నారు.
  చైనా కుటిల యత్నాలను గుర్తించిన మోదీ ప్రభుత్వం కూడా చైనాకు కౌంటర్ గా సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భారత సైనిక బలగాలు నేరుగా ఫ్రంట్ లైన్ పోస్టుల వరకు చేరుకునేలా పటిష్టమైన రోడ్లు, వంతెనలు నిర్మిస్తోంది. ఈ కథనం రాసే సమయానికి ఎల్ఏసీ సమీపంలోని ప్యాంగ్ గాంగ్ లేక్ వెంబడి.. 28 కిలోమీటర్ల కీలకమైన బ్లాక్ టాప్ రోడ్డును మోదీ ప్రభుత్వం పూర్తి చేసినట్లుగా సంతోషకరమైన వార్త వచ్చింది.
  మోదీ ప్రభుత్వం ఏం చేసింది అంటున్న సీఎం కేసీఆర్ కి..ఇది ఒక్కటి చాలేమో.! అలాగే ఇండో మయన్మార్ బోర్డర్లో నక్కిన నాగా తీవ్రవాదులపై సర్జికల్ స్ట్రయిక్స్, అటు పాకిస్తాన్ లోని ఉగ్రశిబిరాల పై మెరుపు దాడులు, ఇంకా ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు వంటి అన్ని కూడా పీఎం మోదీ పాలనలోనే జరిగాయనే విషయం మనం మర్చిపోరాదు.
  ప్రధాని మోదీ… ఇప్పుడు దేశంలో బలమైనా ప్రజా నాయకుడు. భారత ప్రజలకు ఆయనపట్ల అపారమైన విశ్వాసం ఉంది. మోదీ చేతుల్లోనే భారత దేశం సురక్షితంగా ఉంటుందని భారత ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు.. దీనికి ఏమంటారు. మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి.
  మనసా వాచా కర్మణా దేశహితం కోసం పాటుపడండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.
  భారత్ మాతాకీ జై.

  Trending Stories

  Related Stories