తాగిన మత్తులో పోలీసుల మీదకు దూసుకెళ్లిన టాలీవుడ్ హీరోయిన్.. అరెస్ట్

0
898

ఏక్ మినీ కథ చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య థాపర్ జైలు పాలైంది. ముంబయిలో మద్యం సేవించి కారు నడిపి, ఓ వ్యక్తిని గాయపర్చిన కేసులో పోలీసులు కావ్యా థాపర్ ను అరెస్ట్ చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసులపైనా ఆమె నోరు పారేసుకుంది. గురువారం వేకువజామున జరిగింది. ముంబయిలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద ఆమె తన వాహనంతో మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. కావ్యా థాపర్ సదరు కారు డ్రైవర్ ను దూషించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిపై కూడా అసభ్య పదజాల ప్రయోగం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కావ్యా థాపర్ ఓ ఫ్రెండ్ తో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

జుహూలోని నిర్భయ స్క్వాడ్‌ మహిళా కానిస్టేబుల్‌పై బూతులు తిట్టడం, మద్యం తాగి వాహనం నడపడం, అసభ్యంగా ప్రవర్తించడం, దాడి చేయడం వంటి ఆరోపణలపై కావ్య థాపర్‌ను జుహు పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. కావ్య థాపర్ మద్యం మత్తులో కారును మరో వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఆ ప్రదేశానికి చేరుకుని.. నటిని ప్రశ్నించడం ప్రారంభించారు.. మహిళా పోలీసులను ఆమె దూషించడం ప్రారంభించింది. వారిపై అసభ్యంగా ప్రవర్తించింది. కావ్య థాపర్‌ను అరెస్టు చేసి అంధేరీలోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. ఆమెకు బెయిల్ మంజూరయ్యే వరకు అక్కడే ఉండవలసి ఉంటుంది.