More

  కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లను చంపుతానంటూ బెదిరింపులు

  బాలీవుడ్ నటులకు బెదిరింపులు రోజు రోజుకీ ఎక్కువవుతూ ఉన్నాయి. సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌లకు కూడా లేఖ రూపంలో బెదిరింపులు వచ్చాయి. మేలో హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు ఎదురైన గతినే ఈ తండ్రీకొడుకులిద్దరూ ఎదుర్కొంటారని బెదిరించారు. ఇక బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కూడా ఒక లేఖ ద్వారా హత్య చేస్తామనే బెదిరించారు.

  తాజాగా ప్రముఖ బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లను చంపుతానంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి బెదిరించాడు. గుర్తు తెలియని వ్యక్తి పేరిట ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై విక్కీ కౌశల్ శాంతాక్రజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమను బెదిరిస్తున్నట్టు, బెదిరింపు ఇమేజ్ లను పోస్ట్ చేస్తున్నాడంటూ తన ఫిర్యాదులో వివరించాడు. సదరు వ్యక్తి క్రతినా కైఫ్ ను వెంబడిస్తున్నట్టు తెలిపాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు.

  spot_img

  Trending Stories

  Related Stories