More

    ‘కాంతార’కి బ్రహ్మరథం : తెలుగులో రెండోరోజు 11.5 కోట్ల గ్రాస్ వసూళ్లు!!

    ‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం సాధించడం అనేది అరుదైన విషయం. “కాంతార” చిత్రం విడుదలైన పదిహేడవ రోజు కూడా 900 శాతం కలక్షన్స్ పెరగడం అనేది “కాంతార” చిత్రం విజయానికి నిదర్శనం. కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్” ద్వారా తెలుగులో విడుదల చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది “కాంతార’. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ “కాంతార” క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి. అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగులో కూడా అంతకు మించిన విజయఢంకాను మోగిస్తుండడం గమనార్హం!!

    Trending Stories

    Related Stories