నుపుర్‎ను నరికినట్లు వీడియో.. ఆ వెంటనే క్షమాపణలు..!

0
971

బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై గల్ఫ్ దేశాలతో పాటు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమెను అరెస్ట్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా ముస్లింలు ఆందోళన బాట పట్టారు.

తాజాగా ఓ యూట్యూబర్ అత్యుత్సాహం చూపించాడు. నుపుర్ శర్మ తల నరికినట్లు గ్రాఫిక్స్ వీడియో చేసి తన యూట్యూబ్ లో పోస్టు చేశాడు. దీనిపై కూడా తీవ్ర విమర్శలు రావడంతో క‌శ్మీర్ యూట్యూబ‌ర్ ఫైస‌ల్ వాని వెంటనే క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. నుపుర్‌ను న‌రికిన‌ట్లు త‌న వీడియోలో ఫైస‌ల్ చూపించాడు. దాన్ని ఆన్‌లైన్‌లో అత‌ను పోస్టు చేశాడు. మ‌త‌ప‌ర‌మైన ఆరోప‌ణ‌లు చేసేవాళ్ల త‌ల న‌ర‌క‌డమే శిక్ష అని త‌న వీడియోలో ఆ యూట్యూబ‌ర్ చెప్పాడు. గొడ్డ‌లితో నుపుర్ త‌ల‌ను న‌రికిన‌ట్లు ఆ వీడియోలో గ్రాఫిక్స్ ప్ర‌జెంట్ చేశాడు. నుపుర్ త‌ల‌ను విసిరేసిన‌ట్లుగా చూపించాడు.

అయితే ఈ వీడియోను పోస్టు చేసిన త‌ప్పు చేసిన‌ట్లు ఫైస‌ల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఈ వీడియో వ‌ల్ల ఎవ‌రైనా బాధ‌ప‌డి ఉంటే వారికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు తెలిపాడు. అమాయ‌కుడినైన నేను ఆ వివాదంలో ఇరుక్కున్న‌ట్లు చెప్పాడు. మ‌త‌ప‌ర‌మైన భావాల‌ను కించ‌ప‌ర‌డం త‌న ఉద్దేశం కాదు అని, ఎందుకంటే ఇస్లాం మతం స‌హ‌నాన్ని బోధిస్తుంద‌ని ఫైస‌ల్ అన్నాడు. క్ష‌మాప‌ణ‌ల‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eighteen + sixteen =