National

పాక్ గెలుపుతో సంబరాలు చేసుకున్న ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు..

ఆదివారం నాడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించడంతో సంబరాలు చేసుకున్న కశ్మీర్‌లోని శ్రీనగర్ కాలేజీల్లోని విద్యార్థులపై UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) యాక్ట్, భారత శిక్షాస్మృతిలోని ఇతర సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. రెండు వేర్వేరు సంఘటనలలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఒకటి సౌరాలోని SKIMS ఆసుపత్రి హాస్టల్‌లో చోటు చేసుకోగా.. మరొకటి శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC)లోని హాస్టల్‌లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ గెలవగానే హాస్టల్‌లో ఉంటున్న ఎంబీబీఎస్ మరియు ఇతర డిగ్రీలు చదువుతున్న విద్యార్థులు ‘ఆజాదీ’ నినాదాలతో సహా పలు నినాదాలు చేశారు. పాకిస్తాన్‌తో భారతదేశం ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటూ టపాసులు పేల్చారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ కేసుల్లో బుక్ అయిన వాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కాకుండా నిషేధించబడతారని నివేదికలు చెబుతున్నాయి. పాక్ తో భారత్ ఓడిపోయిన తర్వాత, ఈ కళాశాలల్లోని విద్యార్థులు సంబరాలు చేసుకుంటూ, ఉత్సాహంగా నృత్యం చేస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

డాక్టర్ మోనికా లంకేశ్ శ్రీనగర్ లో విద్యార్థులు సంబరాలు చేసుకున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆ వీడియో స్కిమ్స్(Sher-I-Kashmir Institute of Medical Sciences) కు సంబంధించింది. శ్రీనగర్ లోని వైద్య కళాశాలలో భారత జట్టు ఓడిపోగానే అక్కడి యువకులు పెద్ద ఎత్తున విజయ నినాదాలు చేశారు. ఒకరినొకరు హత్తుకున్నారు. పాకిస్తాన్ కు మద్దతుగా విజయ నినాదాలు చేశారు. ఈ వీడియోను పోస్టు చేసిన మోనికా లంకేశ్ వారందరూ పీజీ, ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులని చెప్పుకొచ్చారు. భారత ప్రభుత్వ డబ్బుతో వాళ్లు చదువుకుంటూ ఉన్నారని మోనికా తెలిపారు. ఇలాంటి వారంతా ఉచితంగా ఎంబీబీఎస్ లు పూర్తీ చేస్తారని.. భారత్ కు వైద్య రంగంలో సేవ చేస్తారని మనం భావించకూడదని మోనికా తెలిపారు. భారత్ మీద ద్వేషాన్ని ఇలాంటి వ్యక్తులు పెంపొందిస్తూ ఉంటారని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 4 =

Back to top button