More

    జమ్మూ కాశ్మీర్ లో పోలీసులపై కొనసాగుతున్న దాడులు.. మరో పోలీసు మృతి

    జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులు పోలీసులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతూ ఉన్నారు. శ్రీనగర్ లోని ఓల్డ్ సిటీలో ఆఫ్‌ డ్యూటీలో ఉన్న జమ్మూ కాశ్మీర్ పోలీసును అతడి ఇంటి వద్దే గురువారం కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తిని జావేద్ అహ్మద్ గా గుర్తించారు.

    జావేద్ అహ్మద్‌ను శ్రీనగర్‌లోని సైదాపోరాలోని అతడి ఇంటి సమీపంలో అనుమానిత ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతని మెడలోకి తుపాకీ గుళ్లు దూసుకుపోయాయని అధికారులు వెల్లడించారు. సౌరాలోని షెరి కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. అయినా అతడిని వైద్యులు కాపాడలేకపోయారు. ” జావేద్ అహ్మద్ అనే పోలీసుపై కాల్పులు జరిగాయి. అతన్ని SKIMS ఆసుపత్రికి తీసుకువెళ్లారు, కాని అతడికి అయిన గాయాల కారణంగా మరణించాడు” శ్రీనగర్ పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు చెప్పారు. పోలీసు నివేదిక ప్రకారం జావేద్ జ్యుడిషియల్ ఆఫీసర్ గా విధులను నిర్వర్తిస్తూ ఉన్నాడు. అతడు ఇంటికి వస్తున్న సమయంలో మాటు వేసిన తీవ్రవాదులు అతడిపై దాడి చేశారు.

    గత కొద్దిరోజులుగా పోలీసులను టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు పోలీసులు మరణించారు. శనివారం నాడు బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి లష్కర్ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు మరణించారు. కొందరు సాధారణ పౌరులు కూడా మరణించారు మరికొందరు గాయపడ్డారు. కోవిడ్ -19 విధుల్లో ఉన్న సోపోర్ పోలీస్ స్టేషన్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి లష్కర్-ఎ-తైబా (ఎల్‌ఇటి) బృందం నిర్వహించినట్లుజమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.

    Trending Stories

    Related Stories