ఆ బాలీవుడ్ హీరోలు, దర్శకులకు.. నిఖిల్ ‘కార్తికేయ-2’ ఒక జవాబు

0
928

ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. తామేదో గొప్ప సినిమాతో ముందుకు వచ్చామని వారు చెబుతున్నా.. ప్రజలు కనీసం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా దక్షిణాది సినిమాలకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఇప్పటికే పలు సినిమాలు క్లీన్ హిట్ ను అందుకోగా.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో తీసిన కార్తికేయ-2 సినిమా కూడా మంచి హిట్ తో దూసుకుపోతోంది. మొదటి రోజు వంద స్క్రీన్స్ తో మొదలైన కార్తికేయ-2 ఇప్పుడు ముంబై, ఢిల్లీ నగరాల్లోనే భారీ స్థాయిలో ఆడుతోంది. ఇప్పుడు వేల స్క్రీన్స్ లో కార్తికేయ-2 ఆడుతోంది. ఓ వైపు భారీ స్థాయిలో విడుదలైన లాల్ సింగ్ చద్దా సినిమాను థియేటర్ల నుండి తీసేస్తూ ఉండగా.. కార్తికేయ-2 సినిమాకు స్క్రీన్స్ అంతకంతకూ పెరిపోయాయి.

ద్వాపర యుగంతో.. ఇప్పటి కాలానికి కనెక్ట్ చేసి.. దేవుడినే నమ్మని వ్యక్తిలో వచ్చే మార్పును చూపించిన విధానం చాలా బాగుంది. అందుకే ఈ సినిమాకు క్లీన్ హిట్ దక్కింది. ఒకప్పుడు ఈ సినిమాను తొక్కేయాలని చూసిన వ్యక్తులు.. ఇప్పుడు ఈ సినిమాను ప్రశంసిస్తూ ఉన్నారంటే సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు కృష్ణాష్టమి కావడం.. వీకెండ్ కూడా ఉండడంతో సినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగిపోవచ్చు. మంచి కంటెంట్ తో సినిమా తీస్తే తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుందని మన తెలుగు హీరో నిరూపించాడు.

‘కార్తికేయ 2’ ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకృష్ణుడి కంకణానికి సంబంధించి హీరో సాగించే అన్వేషణతో రూపొందించిన ఈ కథ. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాము .. కానీ ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని ఎంతమాత్రం ఊహించలేదని హీరో నిఖిల్ చెప్పుకొచ్చాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సినిమా వసూళ్లు ఒక రేంజ్ లో పెరగవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోందని అన్నాడు. హిందీ వెర్షన్ కి సంబంధించి కూడా మరిన్ని థియేటర్లు పెరగనున్నాయని అంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సమయానికి ఈ సినిమా థియేటర్లలో ఉండటమనేది కూడా ఆ స్వామి అనుగ్రహమేనని చెప్పుకొచ్చాడు. ఇక ‘కార్తికేయ 2’లో అనుపమ్ ఖేర్ అతిధి పాత్రలో నటించారు. ఆయన శ్రీ కృష్ణ భగవానుని వర్ణించే విధానం సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఆ పాత్ర రాకతో సినిమా మరో మెట్టు ఎక్కుతుంది.