మూగజీవులు పశువులు, గోవుల పట్ల ముస్లిం వర్గం కర్కశంగా వ్యవహరిస్తోంది. అక్రమంగా గోహత్యలకు పాల్పడటం.. పశువులను చంపి తినడం వంటి చర్యలు దేశంలో నిత్యకృత్యంలా మారింది. హిందువులు దైవంగా భావించే ఆవులను నిర్ధాక్షిణంగా హత్య చేస్తున్నారు. వీటిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బక్రీద్ పండుగ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు బి చవాన్ సంచలన హెచ్చరిక జారీ చేశారు. బక్రీద్ పండుగ కోసం పశువులను బలి ఇవ్వకండని కర్ణాటక మంత్రి ప్రభు విజ్ఞప్తి చేశారు. పశువులను బలి ఇచ్చే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్రంలో గోవధ నిషేధం పటిష్ఠంగా అమలవుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ గోవులను వధించకుండా చూడాలని ఇప్పటికే పోలీసు శాఖ, జిల్లా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. ఆవులు, గొడ్డు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, వాటిపై డేగ కన్ను వేసి గోహత్యలను నిరోధించడంలో చురుగ్గా వ్యవహరించాలని పశుసంవర్థక శాఖ, పోలీసు శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
సాధారణంగా బక్రీద్ పండుగ సందర్భంగా ఆవు, ఎద్దు, దూడ, ఒంటెల వంటి పశువులను కూడా బలి ఇచ్చే సంప్రదాయం ఉందని చవాన్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో పశుసంవర్థక శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి గోహత్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవాలని ఆదేశించారు. గోహత్య జరిగినట్లు తేలితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చవాన్ అన్నారు. బెంగళూరు నగర జిల్లాలో బక్రీద్ సందర్భంగా గోహత్యలను నిరోధించడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే జోన్, నగరం జిల్లాలోని తాలూకాలలో టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు.
గతంలోనూ గోహత్యలపై మరో కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో గో సంరక్షకులకు ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ అన్నారు. రాష్ట్రంలో గో సంరక్షకుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. పశువుల వ్యాపారులు పూర్తిగా ఆధిపత్యం చెలాయించి, ప్రాణాలను బలిగొంటున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ విషయాలు బయటకు తెలియడం లేదన్నారు. పశు సంపద పెంచి, వ్యవసాయం, పశుసంవర్ధక వృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అలాగే, గోవు సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మన సంస్కృతిని మనం రక్షించుకోవాలన్నారు.. ప్రోత్సహించాలని మంత్రి చెప్పారు.
రెండేళ్లక్రితం కర్ణాటకలో గోవధ నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆ చట్టం ప్రకారం 13 ఏళ్ల లోపు ఆవులు, ఎద్దులు, దున్న, గేదెలను వధించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 13 ఏళ్లు దాటిన ఎద్దును పరిశోధన కోసం, లేదా అనారోగ్యం పాలైనట్టు పశువైద్యులు నిర్ధారిస్తే వధించవచ్చు. అలాగే, వాటిని వధించేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలించడం కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘించి గోవ వధకు పూనుకుంటే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే, రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఈ చట్టం అమల్లో ఉండగా… రెండేళ్ల క్రితం కర్ణాటక ఆ జాబితాలో చేరింది. అటు యూపీలోనూ గోవులు, పశువుల హత్య జరగకుండా చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా 2015 నుంచి గోవధకు సంబంధించి 115 హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 146 మంది గాయపడ్డారు.