More

    సావార్కర్ పై సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. కోడి గుడ్లతో దాడులు

    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం మడికేరిలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఆ సమయంలో ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వం నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రకటనలో ప్రచురించిన స్వాతంత్య్ర‌ సమరయోధుల జాబితా నుండి భార‌త దేశ మొద‌టి ప్ర‌ధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరును తొలగించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై క్షమాపణ చెప్పాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. జవహర్‌లాల్ నెహ్రూను స్వాతంత్య్ర‌ సమరయోధుల జాబితాలో చేర్చకపోవడం, తన కుర్చీని కాపాడుకోవడానికి ఒక ముఖ్యమంత్రి ఎంత దిగజారిపోతాడో చూపిస్తుందని సిద్ద‌రామ‌య్య రెండు రోజుల కిందట అన్నారు. ‘‘పండిట్ నెహ్రూను అవమానించినందుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. తమ దేశ తొలి ప్రధానిని కించపరిచే వారిని భారతదేశం, కర్ణాటక ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు” అని సిద్ధరామయ్య అన్నారు. “తనను జైలు నుండి విడుదల చేయమని బ్రిటిష్ అధికారులను వేడుకున్న సావర్కర్ స్థానం పొందాడు. కానీ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి స్వాతంత్య్రం కోసం పోరాడిన బాబా సాహెబ్‌ను చివరి వరుసలో ఉంచారు’’ అని విమ‌ర్శ‌లు గుప్పించారు. బ్రిటీష్ అధికారులను వేడుకున్న సావర్కర్ ను ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర సమరయోధునిగా చూపించడానికి ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య సోషల్ మీడియాలో విమర్శించారు. సావర్కర్ ఫోటోతో కూడిన పోస్టర్‌పై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య చేసిన ప్రకటన వివాదాస్పదం అయింది.

    దీంతో మడికేరిలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సమయంలో ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. సావార్కర్ ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. సిద్ధరామయ్య అక్కడి నుండి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories