యెడియూరప్పకు సుప్రీంకోర్టులో ఊరట

0
823

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అవినీతి కేసులో యెడియూరప్ప పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు 2020లో కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఆ సందర్భంగా హైకోర్టు జడ్జి జాన్ మైఖేల్ మాట్లాడుతూ, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013లో యెడియూరప్పపై ఈ కేసు నమోదయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లందూర్, దేవరబీసనహల్లి తదితర ప్రాంతాల్లో ఐటీ పార్క్ కోసం 400 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అయితే ఈ భూమిలో కొన్ని భాగాలను ప్రైవేట్ వ్యక్తులకు యెడియూరప్ప ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.