సీఎంను ఏడిపించిన సినిమా.. ఏముంది అందులో..?

0
842

కొన్ని సినిమాలు సామాన్య ప్రజలనే కాదు.. ప్రముఖులను సైతం కన్నీరు పెట్టిస్తాయి. పెద్ద పెద్ద వ్యక్తులు సైతం వాటిని అడిక్ట్ అయిపోతుంటారు. ఆ క్షణం వారు తమ హోదాను సైతం మరిచిపోయి లీనం అయిపోతుంటారు. అలాంటి సినిమే 777 చార్లీ.

777 చార్లీ అనే సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పెంపుడు కుక్క తో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. సినిమా చూస్తూ చాలా భావోద్వేగానికి గురయ్యారట. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారట. బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా చూసిన అనంతరం బొమ్మై మాట్లాడుతూ ‘‘కుక్కల గురించి అనేక సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారు. కుక్క తన కళ్లతో ఎమోషన్స్‌ని బాగా పలికించింది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. షరతులు లేని ప్రేమ గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను. కుక్కలది షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ’’ అని అన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జంతు ప్రేమికులు. కుక్కలంటే ఆయనకు మహా ప్రేమ. గతేడాది ఆయన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజా సినిమా చూసినప్పుడు మళ్లీ తన కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × 5 =