కర్ణాటకలో బైబిల్ వివాదం.. భగవగ్దీతపై మినిస్టర్ క్లారిటీ

0
776

కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. ఇప్పటికే హిజాబ్ రగిల్చిన వివాదం దేశాన్ని ఎంత షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అది దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. హైకోర్టు సుప్రీంకోర్టు వరకూ చేరి ఇటీవలే తీర్పు వెలువడింది. హిజాబ్ ను విద్యాసంస్థల్లో వాడకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక తాజాగా మరో వివాదం వార్తల్లో నిలిచింది.

కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న క్లారెన్స్ హైస్కూల్ లో విద్యార్థులు.. ప్రతిరోజు బైబిల్ ను తీసుకొని పాఠశాలకు వచ్చేలా ఆదేశించిందని హిందూ జనజాగృతి సమితి ఆరోపించింది. ఈ సందర్భంగా సదురు పాఠశాలలో చదివే క్రైస్తవేతర విద్యార్థులను తప్పనిసరిగా బైబిల్ ను తీసుకెళ్లి చదవాలని కోరిందని హిందూ జనజాగృతి సమితి రాష్ట్రప్రతినిధి గౌడ ఆరోపించారు. ఇది రాజ్యాంగంలోని 2530 ఆర్టికల్ లను ఉల్లంఘించినట్లేనని అన్నారు.

ఈ వివాదం దుమారం రేపడంతో పాఠశాల యాజమాన్యం తమను తాము సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో తమ పాఠశాల చట్టాన్ని గౌరవిస్తామని క్లారెన్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ జెర్రీ జార్జ్ మాథ్యూ అన్నారు. తాము న్యాయవాదులను సంప్రదించామని.. ఈ విషయంలో వారి సలహాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం కన్నడ నాట మరో రాజకీయ దుమారానికి తెరదీసింది. దీనిపై కర్ణాటక ప్రాథమిక మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ స్పందించారు. ఏ విద్యాసంస్థ కూడా ఒక నిర్ధిష్ట మతపరమైన ఆచారాన్ని అనుసరించమని ప్రజలను బలవంతం చేయదని.. అలా చేస్తున్నసంస్థలు కనిపిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని బీసీ నగేశ్ అన్నారు. మైనారిటీ అయినా.. ఇతర సంస్థలు అయినా మతపరమైన ఆచారాలు అనుమతించబడవు అని మంత్రి బీసీ నగేష్ స్పష్టం చేశారు. విద్యార్థులను మతపరమైన ఆచారాలకు విరుద్ధమైన దానిని ఆచరించమని ఏ సంస్థ ఎవరినీ బలవంతం చేయదు.. ఒకవేళ చేస్తే.. డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకుంటుంది అని కర్ణాటక మంత్రి హెచ్చరించారు. త్వరలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిని కలిసి ఆందోళన చేస్తామని హిందూ జనజాగృతి సమితి తెలిపింది.

తాజాగా మంత్రి బీసీ నగేష్ మరోసారి స్పందించారు. స్కూల్ సిల‌బ‌స్‌లో భ‌గ‌వ‌ద్గీత‌ను జోడిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో పాటు క్లారెన్స్ హైస్కూల్ ఇటీవ‌ల విద్యార్ధుల‌ను క్లాస్‌రూంలోకి బైబిల్ తీసుకురావాల‌ని కోర‌డం నేప‌ధ్యంలో మంత్రి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. భ‌గ‌వ‌ద్గీత‌, బైబిల్‌ను క‌ల‌ప‌వ‌ద్ద‌ని కోరారు. భ‌గ‌వ‌ద్గీత మ‌త గ్రంధం కాద‌ని, మ‌తాచారాల గురించి ఇది మాట్లాడ‌ద‌ని చెప్పారు. భ‌గ‌వ‌ద్గీత ప్రార్ధ‌న‌లు ఎలా చేయాలో చెప్ప‌ద‌ని అన్నారు. భ‌గ‌వ‌ద్గీత అన్నింటికీ మించిన‌ద‌ని, విద్యార్ధుల నైతిక స్ధైర్యం పెంచే నైతిక శాస్త్రాన్ని సిల‌బ‌స్‌లో చేర్చేందుకు తాము సిద్ధ‌మ‌ని మంత్రి స్ప‌స్టం చేశారు. బైబిల్‌ను బోధించ‌డం త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ బెంగ‌ళూర్‌కు చెందిన క్లారెన్స్ హైస్కూల్‌కు క‌ర్నాట‌క ప్ర‌భుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసిన నేప‌ధ్యంలో మంత్రి న‌గేష్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా స్కూల్‌కు త‌మ పిల్ల‌లు బైబిల్‌ను తీసుకురావ‌డం ప‌ట్ల త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని పేర్కొంటూ విద్యార్ధుల త‌ల్లితండ్రులు లిఖిత‌పూర్వ‌కంగా హామీ ఇవ్వాల‌ని ఏప్రిల్ 25న‌ క్లారెన్స్ హైస్కూల్ కోర‌డంతో క‌ర్నాట‌క‌లో బైబిల్ వివాదం మొద‌లైంది. ఇక స్కూల్‌లో చ‌దివే క్రైస్త‌వేత‌ర విద్యార్ధుల‌ను కూడా బైబిల్ చ‌ద‌వాల‌ని ఒత్తిడి చేస్తున్నార‌ని హిందూ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here