National

నటి కరీనా కపూర్ ఖాన్ ను అడ్డుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది

కొద్దిరోజుల కిందట ఎయిర్ పోర్టు సిబ్బంది బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను అడ్డుకున్నారు. ఐడెంటిటీని నిరూపించుకున్న తర్వాతనే సల్మాన్ ఖాన్ ను ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లనిచ్చారు. తాజాగా నటి కరీనా కపూర్‌ ఖాన్ తన కుటుంబంతో కలిసి టూర్‌కు బయల్దేరిన ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త సైఫ్ అలీ ఖాన్, పెద్ద కుమారుడు తైమూర్, రెండో కుమారుడు జహంగీర్‌తో కలిసి కరీనా ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ సైఫ్, తైమూర్ ఎటువంటి ఇబ్బందీ లేకుండానే విమానాశ్రయంలోకి వెళ్లారు. అయితే జహంగీర్‌ను తీసుకుని వస్తున్న ఆమె కేర్ టేకర్‌ను ఎయిర్ పోర్టు అధికారులు ఆపారు. ఆమె పాస్‌పోర్ట్ చెక్ చేశారు. కరీనా కపూర్ ఖాన్ వారితో మాట్లాడటానికి ప్రయత్నించింది. అప్పుడు కరీనా కపూర్ పాస్‌పోర్టును కూడా అధికారులు అడిగారు. ఈ సమయంలో అప్పటికే విమానాశ్రయంలోకి వెళ్లిపోయిన సైఫ్ వెనక్కు వచ్చాడు. భార్య కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. కరీనాను చెక్ చేసిన తర్వాతనే అధికారులు లోనికి అనుమతి ఇచ్చారు.

https://www.instagram.com/p/CT1YRgMF6Ut/

స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కరీనా కపూర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..! వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తన పెద్ద కొడుకు కి1398లో భారత్ పై దురాక్రమణ జరిపి నరమేధం సృష్టించిన తైమూర్ పేరును పెట్టుకుంది సైఫ్ కరీనా జంట.! ఇక రెండో కుమారుడికి విదేశీ దురాక్రమణదారులైన మొగల్ రాజుల్లో ఒకడైన జహంగీర్ పేరును పెట్టుకున్నారనే విషయం ఈ మధ్యనే బయటకు వచ్చింది.సైఫ్… తన పిల్లలకు పెట్టిన పేర్ల విషయమై.., సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చనే జరిగింది. విదేశీ దురాక్రమణదారుల పేర్లను తన పిల్లలకు పెట్టి.. సైఫ్.., కరీనా జంట మన దేశానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని వారిపై విమర్శల వర్షం కూడా కురిసింది. ఇక ఇటీవల సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ తమ పెద్ద కుమారుడైన తైమూర్ తో కలిసి వినాయక విగ్రహం ముందు పూజలు చేశారు. వినాయకుడిని మొక్కుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో అందరిలాగే షేర్ చేశారు. అందుకు వారిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. వారు అసలు ముస్లింలే కాదని కూడా సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇంకా కొంతమంది అయితే సైఫ్ అలీఖాన్ తో సహా అతని కుటుంబాన్ని కాఫీర్ అని, లానత్ హై అంటూ దూషించారు. మరికొందరూ సైఫ్ అలీఖాన్ ముస్లిం కాదని.. అతను తన పేరును సురేష్ కపూర్ గా మార్చుకోవాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + 20 =

Back to top button