National

ప్లీజ్.. మా సినిమాను బాయ్ కాట్ చేయకండి: కరీనా కపూర్ ఖాన్

నెపోటిజం గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఇష్టం ఉంటే సినిమాలు చూడండి.. లేదంటే లేదు అన్నట్లుగా మాట్లాడిన బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ వాయిస్ లో చాలా తేడా వచ్చింది. ఆమిర్ ఖాన్ తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా లో ఆమె కూడా భాగమే..! హీరోయిన్ గా చేసింది కరీనా. ఈ సినిమాను చాలా మంది చూడడం మానేశారు. తమ సినిమాపై బాయ్ కాట్ అంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.

నటి కరీనా కపూర్ ఖాన్ తన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దాను ప్రజలు బహిష్కరించవద్దని వేడుకొంటూ చెప్పుకొచ్చారు. కరీనా కపూర్ ఇటీవల RJ సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ “వారు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయకూడదు, ఇది చాలా అందమైన చిత్రం. ప్రజలు నన్ను ఆమిర్ ఖాన్ ను చూడాలని నేను కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.

RJ సిద్ధార్థ్ కన్నన్ కరీనాను ఆమె గతంలో చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించారు. “మీకు నచ్చకపోతే, చూడకండి” అని చేసిన వ్యాఖ్యలు ప్రజలకు అభ్యంతరకరంగా ఉంది.. ప్రేక్షకులను అగౌరవపరిచినట్లే కదా అని ప్రశ్నించగా.. కరీనా మాట్లాడుతూ “నేను ఈ వ్యాఖ్యలు చేసింది ట్రోలింగ్ చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన ఒక వర్గానికి మాత్రమే. ఈ సినిమా పొందబోయే ప్రేమ చాలా భిన్నంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.” అని తెలిపింది.

సినిమాను బహిష్కరించవద్దని ప్రజలను వేడుకుంటూ “ఈ చిత్రాన్ని బహిష్కరించకూడదు, ఇది చాలా అందమైన చిత్రం. ప్రజలు నన్ను, అమీర్‌ని తెరపై చూడాలని కోరుకుంటున్నాను. ఇది మూడు సంవత్సరాలు, మేము పడ్డ కష్టం. కాబట్టి, దయచేసి ఈ చిత్రాన్ని బహిష్కరించకండి, అలా చేస్తే మీరు మంచి సినిమాని బహిష్కరించినట్లే. రెండున్నరేళ్లుగా ఈ సినిమాకు 250 మంది పనిచేశారు” అని ఆమె తెలిపింది.

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కరీనా కపూర్ ఖాన్ తన మాటల ద్వారా తీసుకున్న U-టర్న్‌ను ఎత్తి చూపారు. 2020 లో ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టారు. ట్విట్టర్ యూజర్ అమిత్ కుమార్ కరీనా కపూర్ ఖాన్ రెండు రకాల వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్‌లను ట్వీట్‌లో పంచుకున్నారు.

Related Articles

Back to top button