International

పాకిస్థాన్ లో అంతే.. వాహనాన్ని ఆపారని పోలీసు అధికారిని చితకబాదిన నేవీ అధికారి

ఆదివారం నాడు(మే 23) న పోలీసు అధికారిని నేవీ అధికారి చితకబాదాడు. ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీ దగ్గర ఉన్న మౌరిపూర్ దగ్గర చోటు చేసుకుంది. నేవీ అధికారి బీచ్ కు వెళ్లాలని అనుకున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా కొన్ని రూల్స్ అమలులో ఉన్నాయి.. మీరు అవి పాటించాల్సిందా సదరు పోలీసు అధికారి కోరాడు. దీంతో ఆ నేవీ అధికారికి బాగా కోపం వచ్చేసింది. కారు దిగి తన కారు ఆపిన పోలీసు ఆఫీసర్ పై సీరియస్ అయ్యాడు. అతడికి నడిరోడ్డు మీదనే కొడుతూ కనిపించాడు సదరు నేవీ అధికారి. ఓ వైపు వాహనాలు వెళుతూ ఉండగా.. నడి రోడ్డు మీదనే పోలీసు అధికారిని కొడుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హాకర్ బే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ వీడియోలో పాకిస్థాన్ నేవీ ఆఫీసర్ కరాచీ పోలీసు అధికారిని కొడుతూ ఉండడం గమనించవచ్చు. ఒకానొక దశలో పోలీసు కూడా ఎదురు తిరగడం చూడొచ్చు. నేవీ అధికారి సీనియారిటీని చూసి పోలీసులు కాస్త వెనక్కు తగ్గారు. అయితే నేవీ అధికారి పోలీసుల మీదకు విరుచుకుపడ్డారు. దీంతో నేవీ అధికారులు ఈ ఘటనపై కాస్త సీరియస్ అయ్యారు. నేవీ అధికారి తన కుటుంబంతో కలిసి బీచ్ కు వెళుతున్నప్పుడు పోలీసు అధికారులు అడ్డుకున్నారు.

పోలీసు అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ ఇంత చేసినా కూడా ఆ నేవీ అధికారిపై ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ చేయలేదని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయని అయినా కేసులన్నవి నమోదు చేయడం లేదని అన్నారు. మరో పోలీసు అధికారి మాట్లాడుతూ ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నామని అన్నారు. సంబంధిత అధికారుల నుండి పూర్తి స్థాయిలో నివేదిక రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారని అన్నారు.

పాకిస్థాన్ లో ఇటీవలి కాలంలో పోలీసుల మీద దాడులు ఎక్కువే అయ్యాయి. కొద్దిరోజుల కిందట ఏకంగా పోలీసు స్టేషన్ మీదకు వెళ్లిన ప్రజలు స్టేషన్ ను ధ్వంసం చేశారు. ఇక గత నెలలో చోటు చేసుకున్న ఆందోళనల్లో.. ఆందోళనకారులు ఏకంగా పోలీసులనే బంధీలుగా చేసుకున్నారు. పోలీసుల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. పోలీసులపై దాడులు కూడా షరా మామూలే అన్నట్లుగా పాకిస్థాన్ లో పరిస్థితులు తయారయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − fourteen =

Back to top button