National

పరిష్కరించనంతవరకూ వేలెత్తి చూపుతూనే ఉంటాం: కపిల్ సిబల్

కాంగ్రెస్ పార్టీని పలువురు నేతలు వదిలిపెడుతూ ఉండడంతో ఒకింత నైరాశ్యం పార్టీలో నెలకొంది. ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. ప్రాంతీయ పార్టీల ముందు కూడా ఘోరంగా ఖంగుతింది. ఒక్కొక్కరిగా యువనేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు చేయాల్సిన సమయం వచ్చిందని తేల్చి చెప్పారు. తాము చెప్పే మాటలను నాయకత్వం ఇకనైనా వినాలని.. పార్టీలోని సమస్యలను ఇంకా పరిష్కరించలేదని అన్నారు. వాటిని పరిష్కరించనంతవరకూ వాటి గురించి వేలెత్తి చూపుతూనే ఉంటామన్నారు. పార్టీ నాయకత్వం విఫలమైతే పార్టీ నేతలందరూ విఫలమైనట్టేనని.. ఒకవేళ తాము అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని అన్నారు. బీజేపీలో మాత్రం చేరేది లేదని, తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని అన్నారు. తాను బీజేపీలో చేరడమంటే తాను చచ్చిపోయినట్టే లెక్క అని అన్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం మేల్కోవాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆయన తేల్చి చెప్పారు. బీ

జేపీలో జితిన్ ప్రసాద చేరికను ‘ప్రసాద రామ’ రాజకీయాలని అన్నారు. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని అన్నారు. పార్టీ ఏం చేసింది? ఏం చేయలేదు? అన్నది తనకు అనవసరమని.. ప్రస్తుత రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందన్నారు. పార్టీని వీడడంలో జితిన్ కు కారణాలు ఉండొచ్చని తెలిపారు.

రాహుల్ గాంధీకి సన్నిహితుడైన ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జితిన్ ఈ మధ్య పశ్చిమబెంగాల్ ఇన్ చార్జిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్న నాయకుల్లో ఈయన కూడా ఒక్కరు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను ఎటువంటి డీలూ కుదుర్చుకోలేదని జితిన్ ప్రసాద అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడడానికి పార్టీలో నాయకత్వ లోపంగానీ, రాహుల్ గాంధీగానీ కారణం కాదన్నారు. కాంగ్రెస్ లో ఉండి ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని, ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. అమిత్ షాతోగానీ, జేపీ నడ్డాతోగానీ ఎలాంటి డీల్ చేసుకోలేదని, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − 16 =

Back to top button