More

    హిందూ దేవుళ్లపై అసభ్యకర పోస్టులు.. కటాకటాల వెనక్కు కన్నడ నటుడు..!

    ఆయన పేరులో అహింస ఉందేమో కానీ అతను చేసే ప్రసంగాలు మొత్తం హింసను ప్రేరేపించేవే. ఎంతసేపు హిందూ దేవుళ్లను కించ పరిచే మాటలు.. హిందూత్వవాదాన్ని హేళన చేసే పనులు చేయటం అతనికి అలవాటుగా మారింది. అతనే కన్నడ హీరో, సామాజిక సేవా కార్యకర్త చేతన్ అలియాస్ చేతన్ అహింస. అతన్ని ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తూ కన్నడ హీరో చేతన్ మీద బెంగళూరులోని శేషాధ్రిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనితో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

    హీరో చేతన్ ను శేషాద్రిపురం పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కన్నడ హీరో చేతన్ హిందూ ఆరాధ్యదైవం రాముడు, రామాయణం, ఆయోధ్య గురించి అతనికి ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఐతే బెంగళూరుకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి.. హీరో చేతన్ సమాజంలో తప్పుడు సంకేతాలు పంపిస్తు శాంతికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడని.., ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అతని మీద శేషాధ్రిపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు వివరాలు తెలుసుకున్న పోలీసులు బెంగళూరులో చేతన్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లారు.

    ప్రతినిత్యం హిందూ దేవుళ్లు, బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుని నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కన్నడ హీరో చేతన్ మీద ఇప్పటికే చాలా మంది బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు తక్కువ కావడంతో నటుడు చేతన్ పిచ్చిపట్టినట్లు హిందూ దేవుళ్లను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నాడని ఇప్పటికే చాలా మంది బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇంతకాలం హీరో చేతన్ విషయంలో చూసిచూడనట్లు వదిలేసిన బీజేపీ నాయకులు, హిందూ సంఘ సంస్థ కార్యకర్తలు ఇతన్ని ఇలాగే వదిలేస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు పంపిస్తూనే ఉంటాడని చివరికి అతని మీద కేసు పెట్టారు. ఇప్పటికైనా అతను మారకపోతే తగిన బుద్ది చెప్తామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

    Trending Stories

    Related Stories