More

    బాలీవుడ్ పాపాలను ప్రక్షాళన చేస్తున్న సినిమా

    ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను వీక్షించారు. బాలీవుడ్ చేసిన పాపాలను కడిగేసే చిత్రమని కంగనా వ్యాఖ్యానించారు. కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత కాశ్మీర్ ఫైల్స్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ చిత్రం బాలీవుడ్‌ను ‘పాపాలను’ ప్రక్షాళన చేసిందని పేర్కొంది. ఓ వీడియోలో కంగనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సినిమాను ప్రమోట్ చేయాలని అన్నారు. .పరిశ్రమలో ఎలుకల్లా దాగిన వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలి. పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ ఈ మంచి సినిమాకు మద్దతుగా నిలవాలి. ఈ సినిమా చేసిన టీమ్‌ని కంగనా అభినందించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని కంగన పిలుపునిచ్చారు.

    కంగనా ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’పై ప్రశంసలు కురిపించడం, బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి కాదు. గత వారం, కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ చిత్రం గురించి వివరించింది. #thekashmirfiles గురించి చలనచిత్ర పరిశ్రమలో పిన్-డ్రాప్ నిశ్శబ్దం ఉండడాన్ని గుర్తించాలి. సినిమాలో కంటెంట్ మాత్రమే కాకుండా ఆ సినిమా విషయంలో జరిగిన వ్యాపారం కూడా ఆదర్శప్రాయమైనది. ఇది సంవత్సరంలో అత్యంత విజయవంతమైన, లాభదాయకమైన చిత్రం అవుతుందని కంగనా తెలిపింది.

    కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. సోమవారం వరకు మొదటి నాలుగు రోజుల్లో రూ.42.20 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు గత శుక్రవారం 3.55 కోట్లు (దేశీయంగా), శనివారం రూ.8.50 కోట్లు, ఆదివారం రూ.15.10 కోట్లు, సోమవారం రూ.15.05 కోట్ల చొప్పున ఆదాయం వచ్చిందంటూ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

    Trending Stories

    Related Stories