More

    పొట్టి డ్రెస్ లో ఆలయానికి అమ్మాయి.. కన్నెర్ర చేసిన కంగనా..!

    హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రాలోని బైజ్‌నాథ్ ఆలయంలోకి ఒక అమ్మాయి పొట్టి డ్రెస్ వేసుకుని రావడంపై నటి కంగనా రనౌత్ ఫైర్ అయింది. ఓ ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దీంతో కంగన రనౌత్ స్పందించింది. షార్ట్‌లో వచ్చిన గర్ల్‌ను ‘అవివేకి.. మూర్ఖురాలు.. సోమరిపోతు’ అని తిట్టింది. ‘ఇవి పాశ్చాత్య దుస్తులని.. తెల్లవారు కనుగొన్నారన్నారు. క్యాజువల్స్ లాగా నైట్ డ్రెస్‌లు వేసుకుని గుడికి వచ్చే ఈ దుర్మార్గులది బద్ధకం తప్ప మరొకటి కాదని.. ఇలాంటి మూర్ఖుల కోసం కఠినమైన నిబంధనలు ఉండాలన్నారు. పబ్ లేదా నైట్‌క్లబ్‌కు వెళ్లినట్లుగా బైజ్‌నాథ్ ఆలయానికి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని.. ఒకప్పుడు షార్ట్‌, టీ-షర్ట్ ధరించినందుకు తనను ప్రాంగణంలోకి కూడా అనుమతించలేదని.. తిరిగి వెళ్లిపోయా అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.

    కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో పలు పుణ్యక్షేత్రాలను సందర్షిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌ కు చెందిన కంగనా.. పలు దేవాలయాల విశిష్టతను తెలుసుకుంటూ తన ఫాలోవర్స్ తో కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా తన రాష్ట్ర సంస్కృతి గురించి మాట్లాడుతుంటుంది. దేశ విశిష్టత గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఆమె ఇటీవలే హరిద్వార్ పర్యటనకు వెళ్లి వచ్చింది.

    Trending Stories

    Related Stories