More

  ‘హనుమంతుడి’ని అవమానించిన ‘కమలనాథుడు’..! అతడు చేసిన పనిపై బీజేపీ ఆగ్రహం..!!

  మాట తప్పడాలు, మడమ తిప్పడాలు రాజకీయాల్లో సాధారణ విషయాలే. హామీలు గుప్పించడాలు, ఆనక నొప్పించడాలు సైతం మామూలే. అయితే, దైవిక విషయాల్లో సైతం నిర్భయంగా అబద్ధాలు ఆడేయడం, అవాస్తవాలను పలికేయడం అంటే ఎంత దారుణం. ఈ నిర్వాకం చాలదన్నట్టు.. సంప్రదాయ విరుద్ధ పద్ధతిలో.. పవిత్ర దైవాలయాన్ని కేకులా మార్చి, ఆ కేకు కట్ చేయడం అంటే ఎంత హేయం.. క్రాక్ ఎక్కి కేక్ కట్ట చేశారా..? లేక మదమెక్కి ఇలా ప్రవర్తించారా..? అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ తింగరి పని చేసింది ఏ తింగరి బుచ్చో కాదు.. దైవభక్తాగ్రగణ్యుడినని గొప్పగా చెప్పుకుకునే అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్. ఇంతకీ ఆయనేం చేశాడో తెలుసుకునేముందు నేషనలిస్ట్ గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.

  ఎన్నికల సమయంలో తాను గొప్ప హనుమాన్ భక్తుడిని అని పదే పదే మీటింగుల్లో లెక్చర్లిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్.. ఇప్పుడు ఆ ఆంజనేయస్వామికే అపచారం చేసి, గొప్ప పనిచేసినట్టు ఫీలైపోతున్నారు. హనుమాన్ దేవాలయ ఆకారంలో వున్న కేకు కట్ చేసి, ఫొటోలకు ఫోజులిచ్చేశారు. తెల్లారిలేస్తే.. ఏదో అస్తవ్యస్త పనులకు పాల్పడడం కాంగ్రెస్ నేతలకు రివాజు అయిపోతోంది. మొన్నటికి మొన్న ట్రయిన్ లో పబ్లిగ్గా ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు, అంతకు ముందు సంఘ విద్రోహ శక్తులకు వత్తాసు.. ఇప్పుడు తీరు ఇది. అన్నమాట తప్పడం, అప్రాచ్యపు పనులు చేయడమే తమ జన్మహక్కు అన్నట్టు ప్రవర్తిస్తుంటే.. ఈ నేతలను ఏమనగలం. మొండివాడు రాజు కంటే బలవంతుడు.. అని సామెతలు తల్చుకుని మిన్నకుండడం తప్ప.

  కమల్ నాథ్ ఈ దైవాపచార పనికి పాల్పడటంపై.. బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య హిందువులను, హిందూ దేవుళ్లను అవమానించాలని ఉద్దేశపూర్వకంగా చేసిందే అని హిందు బంధువులు అంటున్నారు. ఆంజనేయస్వామి చిత్రంపై కుంకుమ జెండా మాదిరి నాలుగంచెల కేక్ ను అమర్చి..ఈ దుశ్చర్యకు తలపడ్డారు. ఈ కేక్ కటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాప భీతి లేనివారు, భగవత్ శక్తి ని గుర్తించ లేనివారు, కపట దైవ భక్తిని ప్రదర్శించేవారు మాత్రమే..ఈ తరహా చర్యలకు పాల్పడతారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

  అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ నేతలు.. ప్రజా వ్యతిరేకతను చూశాక ఇప్పుడు హనుమంతుని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అయితే, చేసిన తప్పులకు లెంపలు వేసుకుని, భక్తిభావంతో పూజలు చేస్తే దైవానుగ్రహం లభించవచ్చేమో.. అంతేకాని, ఆ పవిత్ర దైవాన్ని హేళనగా చేసి.. ఆ పుణ్య దేవాలయాన్ని కేకులుగా అమర్చి కట్ చేస్తే…అంతకంటే పాపం మరొకటి ఉండదు. ఇప్పటికే…ఎన్నో మూల్యాలు చెల్లించుకుంటున్న ఆ పార్టీ.. ఇంకా ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందో. ఎక్కడ చూసినా పరాజయాలే పరంపరలే..అలాంటి పార్టీ ఇక అడ్రస్సే గల్లంతు చేసుకునే పరిస్థితి తెచ్చుకుంటామంటే.. ఎవరు మాత్రం ఏం చేయగలరు.

  సనాతన సంప్రదాయానికి, పవిత్ర హిందూ మతానికి అవమానం కల్గించేలా కమల్ నాథ్ ప్రవర్తన వుందని, దీనిని సమాజం అంగీకరించదని మధ్యప్రదేశ్ సీఎం ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ఎన్నికల సమయంలో కమల్ నాథ్ తాను హనుమాన్ భక్తుడినని తెలియజేశారని, ఇప్పుడు హిందూ దైవాలను, హిందువులను అవమానిస్తున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా పోస్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అసలు సిసలు హిందూ వ్యతిరేక పార్టీ అని, కేకు కటింగ్ లతో హిందూ దైవాలకు అపచారం కల్గించిన పార్టీ అని, ప్రజాభిష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే పార్టీ అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. హిందూ మతాన్ని అవమానించే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వదులుకోదని కవిత అనే ట్విటర్ యూజర్ వీడియోను షేర్ చేశారు. హనుమాన్ జీ మందిర్ ఆకారంలోని కేక్ కట్ చేసి కమల్ నాథ్ హిందూ దైవాలపైనా, హిందు సంఘం పైనా విషం వెళ్లగక్కారని కవిత తమ ట్వీట్ లో తెలిపారు. ఈ ఉద్దేశపూర్వక ఘటన ఏం సాధిద్దామని చేశారో అర్థం కావడం లేదని.. మరో ట్విటర్ యూజర్ అమిత్ తెలిపారు.

  దైవాపచారం పాపం, నెటిజన్ల చివాట్లు, భక్తుల ఆగ్రహం.. ఇలా..అన్ని పుట్టిన రోజునాడు మూటకట్టుకోవాల్సి పరిస్థితి పాపం కమల్ నాథ్ కు వచ్చి పడింది. ఏం చేస్తాం. కర్మాను సారేణ బుద్ది..అంటారు కదా. దిక్కుమాలిన కర్మలు అనుభవించాల్సి వచ్చినప్పుడు..ఇలాంటి దుర్బుద్దులే పుడతాయి. ఇలాంటి అవమానాలే ఎదుర్కుంటారు అంటూ..మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.

  Trending Stories

  Related Stories