More

    సీబీఐ, ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

    ఢిల్లీ లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ అయిన తనను బద్నాం చేస్తే… కేసీఆర్ ఆగమవుతారనే యోచనతో ఇదంతా చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ ను మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని.. బట్ట కాల్చి మీద వేయాలనుకుంటున్నారని అన్నారు. కక్షపూరితంగానే బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను తన తండ్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని… దీన్ని ఓర్వలేకే ఇందంతా చేస్తున్నారని ఆమె చెప్పారు. సీబీఐ, ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. బీజేపీపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరిత రాజకీయాలను బీజేపీ చేస్తోందని.. విపక్ష నేతలపై ఏది పడితే అది మాట్లాడటం, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.

    ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుటుంబానికి కూడా లింకులు ఉన్నాయని.. ఢిల్లీ మద్యం పాలసీ డిసైడ్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అనుచరులేనని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్, బెంగాల్ లో తీసుకొచ్చిన మద్యం పాలసీ వెనుక కూడా ఈ శక్తుల హస్తం ఉందని ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీ లో ఒబెరాయ్ హోటల్ లో మంతనాలు జరిపారని.. ఒబెరాయ్ హోటల్ లోనే ఎక్సైజ్ పాలసీని రూపొందించారని ఆరోపించారు.

    spot_img

    Trending Stories

    Related Stories