సామర్లకోటలో దారుణం.. శివను చంపి స్టేషన్ లో లొంగిపోయిన మణికంఠ

0
1119

కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి పుట్టిన రోజు నాడే అతి దారుణంగా అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక భాస్కర్‌నగర్‌‌లో నివసిస్తున్న తలాటి శివ (28) తాపీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. గతంలో రాజీవ్ గృహకల్పలో నివాసం ఉన్నప్పుడు నరాల మణికంఠ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. గొడవలు జరగడంతో అక్కడి నుంచి వచ్చేసి సోదరుడితో కలిసి భాస్కర్‌నగర్‌లో ఉంటున్నాడు. శివపై పగ పెంచుకున్న మణికంఠ అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నాడు బర్త్ డే కావడంతో శివ స్థానిక విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో బిర్యానీ కొనేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడికి చేరుకొని ఉన్న మణికంఠ కత్తితో ఒక్కసారిగా శివపై దాడిచేశాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మణికంఠ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శివ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మణికంఠ అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.