కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ సర్పవరంలో ఓ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. బుధవారం సాయంత్రం బజాజ్ షోరూం ఎదురుగా ఓ వ్యక్తి తన పల్సర్ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. అది చూసి షో రూమ్‌కి చెందిన మెకానిక్‌లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా రోడ్డుపై వాహనం తగలబడిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఫైరింజన్ వచ్చే సరికే బైక్ పూర్తిగా దగ్ధమైపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.