కాకినాడ: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం అమినాబాద్ గ్రామ శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో పేలుడు సంభవించింది. శ్యామ్ సన్ పాల్ ఫైబర్ బోట్ల యూనిట్ యాజమని బడే ప్రభుదాస్ అనే మత్స్యకారుడు దారిమార్గం శుభ్రపరుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ప్రభుదాసుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడ్ని స్థానికులు కాకినాడ హాస్పటల్‌కు తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెట్రోల్ బంక్, బోట్లు తయారు చేసే యూనిట్ ఉన్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలాన్ని కొత్తపల్లి ఎస్సై రామలింగేశ్వరరావు పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.