తెలుగు నట దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆసుపత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాదు అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవల తన ఇంట్లో జారిపడిన కైకాల సత్యనారాయణ కొన్నిరోజుల పాటు సికింద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జి అయిన తర్వాత ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
కైకాల సత్యనారాయణకు అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా, కమెడియన్ ఇలా అన్నీ రకాల ప్రాతలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు సత్యనారాయణ.