More

    నొటోరియస్ క్రిమినల్ ఖాదిమ్ అలియాస్ అషద్ ఖాన్ యూపీ పోలీసుల అదుపులో..!

    ఉత్తర ప్రదేశ్ ఎస్.టి.ఎఫ్. విభాగం ఎట్టకేలకు ఆగస్ట్ 11 న భయంకరమైన ఛైమర్ గ్యాంగ్ కు చెందిన క్రిమినల్ ను అరెస్టు చేసింది. ఛైమర్ గ్యాంగ్ డజన్ల కొద్దీ హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడింది. ఖాదిమ్ అలియాస్ అషద్ ఖాన్ అలియాస్ ఫాతిని టిపి నగర్ ప్రాంతం నుండి ఎస్‌టిఎఫ్ ఆగ్రా డివిజన్ అరెస్టు చేసింది. అషద్ ఖాన్ అలియాస్ ఫాతిపై జౌన్పూర్ పోలీసులు రూ. 25,000 రివార్డ్ ఉంది.

    కన్నమ్‌లోని తీర్వాకు చెందిన ముఠా నాయకుడు అషద్ ఖాన్ అలియాస్ అష్రఫ్ ఈ మధ్య కాలంలో హాపూర్‌లో నివసిస్తున్నాడు. తన దోపిడీ ముఠాతో కలిసి బీహార్, యూపీ, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో డజన్ల కొద్దీ సాయుధ దోపిడీలకు పాల్పడ్డాడు. పలు హత్య కేసులలో భయంకరమైన మరియు ప్రమాదకరమైన ఛైమర్ గ్యాంగ్ ప్రమేయం ఉంది. ఖాదిమ్ తనకు డజన్ల కొద్దీ మారుపేర్లు ఉన్నాయని ఎస్.టి.ఎఫ్. ముందు ఒప్పుకున్నాడు. చాలా తప్పుడు గుర్తింపులను ఉపయోగించానని.. ఆ నకిలీ పేర్లను మరచిపోయానని తెలిపాడు ఖాదిమ్. ముఠా నాయకుడు ఖాదిమ్ పై కనీసం 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 6 కేసులు దోపిడీ సమయంలో చేసిన హత్యలు. ఖాదిమ్ 2016 లో ఒకసారి లక్నో ఎస్.టి.ఎఫ్. చేత అరెస్టు చేయబడ్డాడు, కానీ అతను తన పరిచయాలు, నకిలీ సంతకాల ద్వారా బెయిల్ పొందగలిగాడు.

    నివేదికల ప్రకారం ఛైమార్ గ్యాంగ్ అత్యంత వ్యవస్థీకృత పద్ధతిలో సాయుధ దోపిడీలకు పాల్పడింది. వారు ముందుగా ఒక నిర్దిష్ట ప్రాంతంపై నిఘా నిర్వహిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటారు. ముఠాలోని మహిళా సభ్యులను బిచ్చగాళ్ల వేషధారణలో కొన్ని ప్రాంతాలకు పంపేవారు. ఓ గృహాన్ని ఎంచుకున్న తర్వాత, విలువైన వస్తువులను దోచుకోవడానికి ముఠా సరైన సమయంలో దాడి చేసేది. ముఠా సభ్యులు తమ భిక్షాటన గిన్నెలలో దేవుళ్ల ఫొటోలను ఉపయోగిస్తారని, బిచ్చగాళ్ల వేషం ధరించి రెసిడెన్షియల్ కాలనీల్లో కూడా రెక్కీ నిర్వహించేవారు. దోపిడీ సమయంలో బాధితులను హత్య చేసిన ముఠా సభ్యులకు దోపిడీ నుండి పెద్ద వాటా బహుమతిగా లభిస్తుంది. గ్యాంగ్ లీడర్‌తో సహా ముఠా దోపిడీలు చేస్తున్నప్పుడు అనేక హత్యలు, అత్యాచారాలకు పాల్పడింది. ప్రతిఘటించిన వారిని చంపేయడం ముఠా పద్ధతి. వారు ఇంటిని దోచుకుంటూ కుటుంబంపై దాడి చేసి గాయపరిచేవారు.. మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.

    ఎస్.టి.ఎఫ్. ప్రకారం 1997 లో రాజస్థాన్‌లో జరిగిన 7 హత్య కేసుల వెనుక ఛైమార్ గ్యాంగ్ ఉంది. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారీ. మొత్తంగా ఛైమార్ గ్యాంగ్ ఇప్పటివరకు 200 కి పైగా హత్యలు చేసిందని ఎస్.టి.ఎఫ్. తెలిపింది. ముఠా నాయకుడు ఖాదీమ్ కేవలం 15 రోజుల్లో తన ముఠాను పునర్నిర్మించగలనని అధికారుల ముందు ఒప్పుకున్నాడు. నేరాలు చేయడం తన ‘అభిరుచి’ అని కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. హత్యలు.. అత్యాచారాలు చేయడం అలవాటుగా మారిపోయిందని, దోపిడీలు హత్యలు లేకుండా ఉండలేకపోయేవాడినని అతడు అధికారుల ముందు చెప్పుకొచ్చాడు.

    ఈ ముఠా ఒక నగరం నుండి మరొక నగరానికి మారిపోతూ ఉండేది. తరచుగా రాష్ట్ర సరిహద్దులను దాటడమే కాకుండా కొత్త గుర్తింపులను సంపాదిస్తారు. వారు ప్రతి కొత్త రాష్ట్రంలో నకిలీ పేర్లతో తయారు చేసిన ఆధార్ కార్డులు మరియు ఓటర్ ఐడీలను కూడా పొందుతారు. దశాబ్దాలుగా అనేక రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రమాదకరమైన సంచార నేరస్థుల ముఠాలలో ఈ ముఠా ఒకటి. ముఠా సభ్యులు ఒకే చోట ఎక్కువసేపు ఉండరు. తరచుగా సంపన్నుల గృహాలపై దాడులు చేసేవారు. నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను క్రూరంగా అంతమొందించేవారు. వారి అంతుచిక్కని స్వభావం, సంచార జీవనశైలి కారణంగా ఈ ముఠా సభ్యులను గుర్తించడం చాలా కష్టమయ్యేది.

    Trending Stories

    Related Stories