ఘరానా మోసగాళ్ల గుట్టురట్టు

0
786

కంటైనర్‎లో తరలిస్తున్న సెల్‎ఫోన్ లోడును స్వాహా చేసిన ఘరానా మోసగాళ్ళ గుట్టును కడప పోలీసులు రట్టు చేశారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేధించారు. సెల్‎పోన్ల లోడుతో పరారైన ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు కోసం గాలింపు చేపట్టారు. వారి వద్ద నుంచి కోటి 58లక్షల రూపాయల విలువైప 1397 సెల్‎ఫోన్లు, 5 ల్యాప్‎‎ట్యాప్‎‎లు, 193 బ్లూ టూత్‎లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో మీడియా ఎదుట హాజరు పరచి వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. బ్లూ డాట్ కంపెనీ ఫిర్యాదు మేరకు గత నెల 30న చిన్నచౌక్ పోలీ‎స్‎స్టేషన్‎లో కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 14 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఇర్కాన్ సర్కిల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మీడియా కు వివరించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

12 − 4 =