More

    చేతికి ఉంగరాలతో కేఏ పాల్.. మీడియా ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానం

    మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో తాను ఘన విజయం సాధిస్తానని చెబుతూ.. పోలింగ్ రోజు కూడా హంగామా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఒక్కరే ప్రతి పోలింగ్ స్టేషన్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోలింగ్ స్టేషన్ ను పరిశీలించిన వెంటనే ఆయన పరుగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో పాల్ కు ఎన్నికల సంఘం ఉంగరం గుర్తు కేటాయించింది. పాల్ తన చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని పోలింగ్ బూత్ లను పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ మీడియా ప్రతినిధి పాల్ ను ప్రశ్నించారు. ‘మీది ఉంగరం గుర్తు. చేతికి ఇన్ని ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ లోకి వచ్చారు. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా?’ అని ప్రశ్నించారు. దీనికి పాల్ సమాధానం ఇస్తూ ‘టీఆర్ ఎస్ వాళ్లది కారు గుర్తు. ఆ పార్టీ నాయకులు బయట ముప్పై వేల మంది ముప్పై వేల కార్లలో తిరుగుతున్నారు? వాళ్లు కార్లలో రాకుండా సైకిల్ మీద వస్తారా?’ అంటూ పాల్ ఎదురు ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్‌ సరళిని పరిశీలించి బయటకు వచ్చిన కేఏ పాల్ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానన్నారు

    మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ ఆకట్టుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ కనిపించారు.

    Trending Stories

    Related Stories