More

    చెప్పులు కుట్టిన కేఏ పాల్.. ఆ తర్వాత చెప్పిన మాటలే హైలైట్..!

    కేఏ పాల్.. మునుగోడు ఉప ఎన్నికలో తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ దూసుకుని వెళుతున్నారు. ఆయనకు ఓట్లు పడతాయో లేదో తెలియదు కానీ ప్రచారంలో మాత్రం తనదైన మార్కును ప్రదర్శిస్తూ ఉన్నారు. మునుగోడు మండల కేంద్రంలో చెప్పులు కుడుతూ ప్రచారం నిర్వహించారు. అలాగే అక్కడున్న ఓటర్లతో కూడా సరదాగా కబుర్లు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో చెప్పులు కుట్టిన అబ్రహం లింకన్ అధ్యక్షుడు అయ్యాడన్నారు. అది అమెరికా గొప్పతనమన్నారు. కానీ మనదేశంలో ఇది సాధ్యమా అంటూ కేఏ పాల్ అన్నారు. చెప్పులు కుట్టుకుని బతికే వారికి రోజుకి 300 రూపాయలు కూడా రావడం లేదన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. మార్పు రావాలంటే కేఏ పాల్ తోనే సాధ్యమని.. అందుకే ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాంటూ ఓటర్లను అభ్యర్థించారు పాల్. టీఆర్ఎస్, బీజేపీ గుండాలు అడుగడుగునా తన ప్రచారాన్ని అడ్డుకుని.. తన పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్ తప్పుకోవడంతో, కేఏ పాల్ చివరి నిమిషంలో మునుగోడు బరిలో పోటీకి దిగారు. కాగా ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర్య అభ్యర్థిగా కేఏ పాల్ పోటీలో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కేఏ పాల్ సందడి కొనసాగుతూనే ఉంది. లోకల్ గా ఓ సెలూన్ లో హెయిర్ కట్ చేయించుకున్నారు. ఓటర్లకు మిఠాయిలు, మంచినీళ్ల బాటిళ్లు పంచారు.

    Trending Stories

    Related Stories