More

    పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ కు పక్షవాతం

    ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ తాను ప‌క్ష‌వాతానికి గురయ్యానని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. ముఖం భాగంలో ప‌క్ష‌వాతానికి గురికావ‌డంతో ఈ వారం అత‌డు నిర్వ‌హించాల్సిన ప‌లు షోల‌ను ర‌ద్దు చేశారు. తాను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని, అంత వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల‌ని అభిమానులకు సూచించాడు. రామ్‌సే హంట్ సిండ్రోమ్‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని తెలిపాడు. ముఖంపై కుడివైపున ప‌క్ష‌వాతం వ‌చ్చింద‌ని, ఆ కార‌ణంగా క‌న్ను ఆడించ‌లేక‌పోతున్నాన‌ని, ఇక కుడి వైపున చిరున‌వ్వు కూడా క‌నిపించ‌ద‌ని చెప్పుకొచ్చాడు. రామ్‌సే హంట్ సిండ్రోమ్ ముఖ నరాలపై దాడి చేస్తుంది. చికెన్ పాక్స్‌కు కారణమయ్యే వైరస్ వల్ల వస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా తన ముఖం కుడి భాగాన్ని ఎలా కదలించలేకపోతున్నాడో వీడియోలో జస్టిన్ చేసి చూపించాడు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు. తన ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫేషియల్ ఎక్సర్‌సైజులు కూడా చేస్తున్నట్టు వెల్లడించాడు. త్వరలో సాధారణ స్థితికి వస్తుందన్నాడు. కోలుకున్నాక అభిమానుల కోసం ప్రదర్శనలు చేస్తానని బీబర్ ఆకాంక్షించాడు.

    Trending Stories

    Related Stories