Telugu States

హైదరాబాద్ కు చేరుకున్న జ‌స్టిస్ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ఉద‌యం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. జ‌స్టిస్ రమణ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇత‌ర అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం జ‌స్టిస్‌ రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. జస్టిస్‌ రమణ దంప‌తులు గురువారం రాత్రి తిరుమల చేరుకుని.. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయన తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వ‌స్తుండ‌డంతో ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికేందుకు తెలంగాణ స‌ర్కారు ఏర్పాట్లు చేసింది. జస్టిస్ ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ స్వాగతం పలికారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, అధికారులు కూడా ఎయిర్ పోర్టులో జస్టిస్ రమణకు స్వాగతం పలికారు. అక్కడి నుండి జస్టిస్ రమణ రాజ్ భవన్ అతిథి గృహానికి బయల్దేరారు. ఆయన రాజ్ భవన్ అతిథి గృహంలో మూడ్రోజుల పాటు గడపనున్నారు. రాజ్‌భవన్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట్ర గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

9 + seventeen =

Back to top button