కమ్రాన్ భాయ్ అలియాస్ హనీస్‌ హతం

0
697

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. శుక్రవారం ఉదయం షోపియాన్‌లోని కప్రేన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహమ్మద్‌ (JeM) ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాది చనిపోయాడని కశ్మీర్‌ ఏడీజీపీ తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని చెప్పారు.

ఉగ్రవాదులపై భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు జరిపిన సంయుక్త ఎన్‌కౌంటర్‌లో జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రవాది హతమయ్యాడు. కశ్మీర్ జోన్ పోలీసుల కథనం ప్రకారం, “షోపియాన్‌లోని కప్రెన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, ఆర్మీ తమ విధుల్లో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియజేస్తాము. ” అని అన్నారు. కుల్గామ్-షోపియాన్ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్న కమ్రాన్ భాయ్ అలియాస్ హనీస్‌గా గుర్తించబడిన జేఎం ఉగ్రవాద సంస్థ సభ్యుడు చనిపోయాడు.. ఇంకా అన్వేషణ కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు.