నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 5వందల మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన ఐదు వందల మంది కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మర్రిగూడ మండలం అజలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీకి చెందిన 60మంది.. మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన 60 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, మర్రిగూడ మండలం ఉట్టిపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి 60మంది కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.