More

    మునుగోడులో కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగిన అమిత్ షా

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుపడ్డారు. మునుగోడులో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నందునే రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. పెట్రోల్ ధరలు మోదీ ప్రభుత్వం రెండుసార్లు తగ్గించినా.. కేసీఆర్ సర్కారు తగ్గించలేదని అన్నారు. మోడీ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల సాయం అందించినా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోనే ఎందుకుందని అమిత్ షా ప్రశ్నించారు. 8 ఏండ్ల పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి తప్ప యువతకు ఉపాధి దక్కలేదని.. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. కుటుంబ పాలన వల్ల తెలంగాణ నష్టపోతోందని… కేసీఆర్ పాలనను పడగొట్టడానికి ఇది ప్రారంభమని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ సీఎం ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చారని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్… దళితులను మోసం చేశారని మండిపడ్డారు. జిల్లాకో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని నిర్మాస్తామని కేసీఆర్ చెప్పారని, నల్గొండకు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి వచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు… అందరికీ వచ్చాయా? అని ప్రశ్నించారు అమిత్ షా. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణలో కమలం వికసించేలా చేయాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పుకొచ్చారు.

    spot_img

    Trending Stories

    Related Stories