More

    టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు

    టీటీడీలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నట్టేట ముంచుతూ ఉన్నారు. తాజాగా తిరుమ‌ల‌లో ల‌డ్డూ కౌంట‌ర్లను నిర్వహిస్తున్న కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేర‌కు తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంత పురం జిల్లా కొత్తపేట‌కు చెందిన జి. బ‌బ్లూ అనే యువ‌కుడి ఫిర్యాదు మేర‌కు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ మేర‌కు చ‌ర్యలు తీసుకున్నారు. కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన మేనేజ‌ర్ గణేశ్‌, కో-ఆర్డినేట‌ర్ చందు, ల‌డ్డూ కౌంట‌ర్ బాయ్ మేక‌ల సురేశ్‌ క‌లిసి కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థలో రెగ్యుల‌ర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువ‌త నుంచి డబ్బులు వ‌సూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించ‌కుండా మోసం చేయ‌డంతో బ‌బ్లూ అనే యువ‌కుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

    తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం స్వామివారిని 67, 525 మంది భక్తులు దర్శించుకోగా 31,484మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.24 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.

    spot_img

    Trending Stories

    Related Stories