More

    కశ్మీర్‎లోని ఆ పల్లె ప్రపంచాన్ని పిలుస్తోంది..!

    అందాల ఆణిముత్యం కశ్మీర్. ఆ ఆణిముత్యానికి హిమగిరి శిఖరాల సొబగులు. ఆ సొబగుల నడుమ సుందర వనాలు. ఆ అటవీ ప్రాంతంలో.. ఓ పచ్చని పల్లెసీమ. ఆ పల్లె ఇప్పుడు విశ్వవ్యాప్త కీర్తిని ఆర్జించబోతోంది. భారత దేశంలోనే అతి పెద్ద యోగా కేంద్రం.. ఈ చిరు పల్లెలో నిర్మించబడుతోంది.

    జమ్మూ కశ్మీర్‌ మంటలై గ్రామంలో, తావి నది ఒడ్డున ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. కైలాష్ కుండ్ లో పుట్టిన తావి నదిని సూర్యపుత్రి అని సైతం పిలుస్తారు. దేశంలోనే పెద్ద యోగా కేంద్రం ఇంతటి చక్కటి ప్రాంతంలో.. ఏర్పాటవుతోంది. భారత ప్రభుత్వం ఇందు కోసం 9 వేల 782 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి.

    ప్రషాద్ పథకం కింద కత్రా-వైష్ణో దేవి ఆలయ మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం 52 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. హెర్బల్ గార్డెన్ల వినియోగాన్ని ప్రొత్సహించడం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ విశేష కృషి చేస్తోంది. ఇక్కడి ఎత్తైన ప్రాంతాల్లో అరుదైన మూలికలను పెంచడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.

    కేంద్ర ప్రభుత్వం జమ్మూ akhnoor లో 16 కోట్ల 19 లక్షల రూపాయలతో ఆయుర్వేద కళాశాలను నిర్మిస్తోంది. అదేవిధంగా 32 కోట్ల 50 లక్షల రూపాయలతో గండేర్‎బల్ లో యునాని వైద్య కళాశాల, ఆసుపత్రి ఏర్పాటు చేస్తోంది. kupwara, kulgam, kishwar గ్రామాల్లో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులను నిర్మిస్తోంది. దేవాలయాల నగరం జమ్మూను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడ్తోంది.

    ఆయుష్ dispenceriలు, ఆయుష్ హెల్త్, వెల్ నెస్ సెంటర్ల అప్‏గ్రేడ్ కోసం కూడా కేంద్రం నిధులు కేటాయించింది. 370 ఆయుష్ dispenceriల కోసం దాదాపు 16 కోట్ల 30 లక్షల రూపాయలను మంజూరు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ గత మూడేళ్లలో సాధించిన విజయాలపై జాతీయ ఆయుష్ మిషన్ అభినందనలు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం గత ఏడాది నిధులకు దాదాపు నాలుగు రెట్లు పెంచి.. 72 కోట్ల రూపాయలను మంజూరుచేసింది.

    ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పదిమందికీ షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ చానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి.

    Trending Stories

    Related Stories