భారతదేశంలోనే అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ లో ఒకటైన ‘జియో’.. ఈరోజు తమ వినియోగదారులకు చుక్కలు చూపించింది. జియో నెట్‌వర్క్ డౌన్ అయింది. నెట్‌వర్క్ సరిగా రావడం లేదని యూజర్లు ఫిర్యాదు చేసారని డౌన్‌డిటెక్టర్ చూపించింది. కొందరు యూజర్లకు ఈ సమస్య ఎదురైంది. ఈ నెట్‌వర్క్ డౌన్ అనేది ఒక్క ప్రాంతానికే పరిమితమా లేదంటే దేశమంతా ఉందా అన్నదానిపై జియో నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నెట్‌వర్క్ సరిగా రావడం లేదని కొందరు యూజర్లు ట్వీట్లు చేశారు. కనీసం రెండున్నర గంటల నుంచి Reliance Jio Down అయినట్టు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రెండున్నర గంటలుగా జియో నెట్‌వర్క్ నో సర్వీస్ అని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇండియాలో ట్విటర్‌లో #jiodown ట్రెండింగ్‌లో ఉంది. డౌన్‌డిటెక్టర్‌లో కొన్ని వేల మందికిపైగా యూజర్లు జియో నెట్‌వర్క్‌పై రిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం నుంచీ ఈ సమస్య ఎదురవుతున్నట్లు కొందరు చెప్పారు.
మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలు సహా ఢిల్లీ, బెంగళూరు, ఇతర కొన్ని నగరాల్లో జియోతో సమస్య ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలుస్తున్నది. కొంత మంది యూజర్లు తమ జియో నెట్‌వర్క్ ఉదయం నుంచి పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఇంకొందరు జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పని చేయలేదని తెలిపారు. ఇంటర్నెట్ సేవలు వినియోగించడంలో లేదా కాల్స్/ఎస్ఎంఎస్ సేవలు వినియోగించుకునేటప్పుడు సాధారణంగా అప్పుడప్పుడు కలిగే సమస్యే ఇది అని.. ఇది తాత్కాలికమైన సమస్య అని తెలిపింది. వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తమ బృందం పనిచేస్తున్నట్టు జియో సంస్థ తెలిపింది.