సూరత్‌లో 21 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఆమె స్నేహితుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడు బాలిక మెడపై పదునైన కత్తిని ఉంచాడు.. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి చాలా భయపడిన చుట్టుపక్కల వారు ఈ ఘటనలను వీడియోలో బంధించారు. అతను ఆమెను కొన్ని నిమిషాల పాటు బందీగా ఉంచి, ఆమె మెడను కోసి, అక్కడికక్కడే చంపేశాడు. ఆమెను ఏమీ చేయొద్దు అని స్థానికులు అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా దారుణానికి తెగబడ్డాడు.
నిందితుడు ఫెనిల్ గోయానీ.. బాధితురాలు గ్రీష్మ వెకారియాను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో కాలేజీలో ఫెనిల్ గోయానీని పిలిపించి మందలించారు. బాధితురాలు గ్రీష్మ వెకారియాను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఫెనిల్ గోయాని, గ్రీష్మ వెకారియా లు సూరత్ లో ఒకే స్కూల్ లో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచి ఒకరికొకరు తెలుసు, స్నేహితులు కూడా. ఏడాది నుంచి తన ప్రేమను అంగీకరించాలని గ్రీష్మ వెంట ఎన్నోసార్లు తిరిగాడు గోయాని. అందుకు గ్రీష్మ ఒప్పుకోలేదు. గ్రీష్మను..తన ప్రేమకు ఒప్పుకోవాలని వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో గ్రీష్మ తన కుటుంబసభ్యులకు తన బాధ చెప్పింది. దీంతో కామ్రేజ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6గంటల సమయంలో గ్రీష్మ తమ్ముడు తమ మేనమామ సుభాష్‌భాయ్ ను తీసుకుని వెళ్లి గోయానిని మందలించాడు. గ్రీష్మ వెంటపడొద్దని వార్నింగ్ ఇచ్చారు. చేతిలో ఉన్న కత్తితో ఆతనిని పొడిచాడు. దీంతో సోదరుడితో కలిసి తప్పించుకునేందుకు గ్రీష్మ ప్రయత్నించింది. గ్రీష్మను పట్టుకున్న ఫెనిల్ గోయాని వెంట తెచ్చుకున్న కత్తితో గ్రీష్మ గొంతు కోసేశాడు. దీంతో గ్రీష్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంతటితో ఆగకుండా గ్రీష్మ సోదరుడిని సైతం గాయపరిచాడు. చివరికి ఆత్మహత్య చేసుకుందామని గోయాని ప్రయత్నించాడు. కత్తితో తన చేతిని కోసుకున్నాడు. విషం తాగేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. గోయానిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోయాని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గాయపడిన ఆమె ఇద్దరు బంధువులు, నిందితులను చికిత్స కోసం SMIMER ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని గత ఏడాది కాలంగా గోయాని వేధిస్తున్నాడని, అతను ఒకే వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించలేదని, రెండు కుటుంబాలు ఈ విషయాన్ని సామరస్యంగా ముగించేందుకు ప్రయత్నించాయని ఎస్పీ జడేజా తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు మా వద్ద ఉన్నాయి, అవి ఫోరెన్సిక్స్ కోసం పంపబడతాయని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారాన్ని టేకప్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కోసం అప్పీల్ చేస్తామని పోలీసులు తెలిపారు.