More

    మరో దిగ్గజం రిటైర్మెంట్ ప్రకటన

    మహిళల క్రికెట్ లో మరో లెజెండరీ ప్లేయర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసింది. టీమిండియా మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంగ్లండ్ తో సిరీస్ లో మూడో వన్డే తర్వాత క్రికెట్ ఆడబోనని ఆమె ప్రకటించారు. ఇంగ్లండ్ తో జరగబోయే వన్డే జట్టుకు ఆమెను ఎంపిక చేశారు. 2022 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆమె భారత జట్టుకు దూరమవుతానని హింట్స్ ఇచ్చింది. అనుకున్నట్లుగానే ఝులన్ గోస్వామి ఆటకు గుడ్ బై చెప్పేసారు. మహిళ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా గోస్వామి రిటైర్ అవుతున్నారు. మూడు ఫార్మాట్లలో ఆమె ఇప్పటి వరకు 352 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ తో జరగబోయే వన్డే సిరీస్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానుంది.

    కొన్ని వారాల క్రితం బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న భారత జట్టులో 39 ఏళ్ల ఝులన్ ను ఎంపిక చేయలేదు. ఆమె భారత జెర్సీలో చివరిసారిగా మార్చిలో న్యూజిలాండ్‌ తో మ్యాచ్ లలో కనిపించింది. జూలైలో శ్రీలంకతో ఆడిన భారత జట్టులో కూడా ఆమె ఎంపిక కాలేదు. BCCI భారత మహిళా క్రికెట్‌కు ఆమె సేవలను గౌరవించాలని, ఆమెకు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించింది. ఝులన్ 2002లో భారత్‌కు అరంగేట్రం చేసింది. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్‌లో 12 టెస్టులు, 201 ODIలు మరియు 68 T20Iలకు ప్రాతినిధ్యం వహించింది. మిథాలీ రాజ్‌తో పాటు, ఆమె భారత మహిళా క్రికెట్‌కు పెద్ద దిక్కుగా మారింది. మూడు ఫార్మాట్లలో మొత్తం 352 వికెట్లు తీసుకుంది ఝులన్. ఆల్-ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టులను ఎంపిక చేసింది. సెప్టెంబర్ 10 నుంచి ఇంగ్లాండ్‌లో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

    spot_img

    Trending Stories

    Related Stories