ప్రస్తుతం దేశంలో జట్కా మాంసానికి డిమాండ్ పెరుగుతూ ఉంది. కేవలం ఇన్ని రోజులూ హలాల్ మాంసాన్ని కొందరు పని గట్టుకుని ప్రమోట్ చేయగా.. ఇప్పుడు చాలా మంది కళ్లు తెరచుకుని జట్కా మాంసం వైపు దృష్టి పెడుతూ ఉన్నారు. ఆ వైపు పలువురు అడుగులు వేస్తున్నారు. గురువారం (సెప్టెంబర్ 1), బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి తజిందర్ బగ్గా తన క్లౌడ్ కిచెన్ ‘కుల్హాద్ బిరియానీ’ని ప్రారంభించినట్లు ప్రకటించారు. క్లౌడ్ కిచెన్ లో భాగంగా ఝట్కా మాంసాన్ని మాత్రమే అందిస్తున్నారు. ఇది హలాల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మొదలైంది. ‘హైదరాబాదీ చికెన్ బిర్యానీ’ పేరును ‘భాగ్యనగర్ దమ్ చికెన్ బిరియానీ’గా మార్చేశారు. దీంతో బగ్గా ప్రశంసలు అందుకున్నారు.
భారతదేశపు మొట్టమొదటి ఝట్కా బిరియానీ బ్రాండ్‌ను ప్రారంభించడంతో కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. కావాలనే నెగటివ్ రివ్యూలను ఇస్తూ వస్తున్నారు. కుల్హాద్ బిరియానీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జొమాటోలో చాలా మంది కావాలనే నెగటివ్ రివ్యూలను పోస్టు చేయడం జరుగుతోంది. తాను కొత్తగా ప్రారంభించిన క్లౌడ్ కిచెన్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతుదారులు కావాలనే నెగటివ్ గా రివ్యూలు ఇస్తున్నారని, తమకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని తజిందర్ బగ్గా ఆరోపించారు. ‘ఆప్ కు చెందిన బృందం మా బ్రాండ్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. నెగటివ్ రివ్యూలను ఇవ్వాలని చాలా గ్రూప్ లకు సందేశం పంపింది. కోల్‌కతాలో కూర్చొని ఢిల్లీలో ఫీడ్‌బ్యాక్ ఇస్తున్న మయూఖ్ రాయ్ అనే వ్యక్తి గురించి ఉదాహరణగా చూడవచ్చు.’ అని తజిందర్ బగ్గా ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. కావాలనే నెగటివ్ రివ్యూలు ఇస్తున్న వారి కామెంట్లను పోస్ట్ చేశారు తాజిందర్ బగ్గా. కొందరైతే ఇక్కడ దాల్ ఏ మాత్రం బాగాలేదని చెప్పడం కూడా రివ్యూలలో గమనించవచ్చు. తమ వద్ద దాల్ మఖనీ అనే ఐటెం లేదని.. వాటికి కూడా నెగటివ్ రివ్యూ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
తజిందర్ బగ్గా ఆమ్ ఆద్మీ పార్టీతో విభేదిస్తున్నారు. ఈ ఏడాది మే 6న పంజాబ్ పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి బీజేపీ నేతను అరెస్టు చేశారు.
10-12 కార్లతో కూడిన కాన్వాయ్ పంజాబ్ నుండి 50 మంది పోలీసులు తజిందర్ బగ్గా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఆయన్ను తీసుకువెళ్లారు. పోలీసులు ఆయన తండ్రిపై కూడా దాడి చేశారు.