National

ఎమ్మెల్యే చేతుల్లో దెబ్బలు తిన్న ప్రిన్సిపాల్.. తీవ్ర విమర్శలు

కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై సరైన సమాధానాలు ఇవ్వలేకపోయినందుకు జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే ఒక కళాశాల ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బలు కొట్టారు. నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌పై మండ్య ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ జూన్ 20, సోమవారం తన సహచరుల ఎదుట పలుమార్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్‌ పట్ల శ్రీనివాస్‌ ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించారని పలువురు మండిపడ్డారు. పునరుద్ధరించిన ఐటీఐ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయోగశాలలో జరుగుతున్న పనుల గురించి ప్రిన్సిపాల్ నాగనాద్ సరైన సమాచారం ఇవ్వలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్‌ ల్యాబ్‌కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. కాలేజీ ప్రిన్స్‌పాల్‌.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి ఏవేవో సమాధానాలు చెబుతూ వచ్చాడని ఎమ్మెల్యే అనుచరులు చెప్పారు. అయితే ఎమ్మెల్యే శ్రీనివాస్‌.. అక్కడున్న వారందరి ముందే ప్రిన్సిపాల్‌ చెంప చెళ్లుమనిపించారు. ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

Back to top button