More

    ఉగ్రవాదుల కాల్పుల్లో అయిదుగురు జవాన్ల వీరమరణం

    జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి సెక్టార్ లో అయిదుగురు జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. సోమవారం ఉదయం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన సైనిక బృందంలోని జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తో పాటూ మరో నలుగురు సైనికులు మరణించారని సైనిక వర్గాలు తెలిపారు. పీర్ పంజాల్ రేంజ్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాన్ని తిప్పికొట్టే క్రమంలో సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. పూంచ్ జిల్లా సురాన్‌కొటే పరిధి డీకేజీ గ్రామాల్లో ఉగ్రవాదుల తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులకు జరపడంతో సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. దీంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు కూడా హతమైనట్టు తెలుస్తోంది.

    ఉగ్రవాదులతో జరుగుతున్న కాల్పుల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించగా.. మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కృష్ణ ఘాటి సెక్టార్‌కు దగ్గరగా ఉన్న గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలియజేశారు. గ్రామాల్లో దాక్కున్న ఉగ్రవాదులు భారత భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఇందులో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తో పాటూ మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో వారు మరణించారు.

    భద్రతా దళాలు ఈరోజు బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని ఇంతియాజ్ అహ్మద్ దార్‌గా గుర్తించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తరపున పని చేస్తున్నాడు. “చంపబడిన ఉగ్రవాది ఇమ్తియాజ్ అహ్మద్ దార్‌గా నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్‌ఈటీ (TRF) తో సంబంధం కలిగి ఉన్నాడు. అతను ఇటీవల షాగుండ్ బందిపొరాలో జరిగిన పౌరుల హత్యలో పాల్గొన్నాడు” అని IGP కాశ్మీర్ విజయ్ కుమార్‌ తెలిపారు.

    Trending Stories

    Related Stories