టీమ్ ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బుమ్రా (6/19) అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ను ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే..! బుధవారం ఐసీసీ వెల్లడించిన వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎకబాకిన బుమ్రా రెండేళ్ల తర్వాత తిరిగి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. 2020 ఫిబ్రవరిలో బుమ్రా అగ్రస్థానం కోల్పోయాడు. టెస్టు, వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌ల్లో టాప్-10లో ఉన్న ముగ్గురు బౌలర్లలో బుమ్రా స్థానం సంపాదించాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. షాహీన్ అఫ్రిదీ(పాకిస్తాన్) 3వ ర్యాంక్, జోష్ హాజెల్‌వుడ్(ఆస్ట్రేలియా), ముజీబ్ ఉర్ రెహమాన్(అఫ్ఘనిస్తాన్) తర్వాతి స్థానాలో ఉన్నారు. షమీ 3 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 4వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ అర్థ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్ ధావన్ 12వ ర్యాంక్ లో నిలిచాడు.