జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశం..?

0
835

వెన్నునొప్పితో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడం సందేహమేనని వార్తలు వస్తున్నాయి. ఇది భారత్‌కు పెద్ద దెబ్బ. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ ఆడేందుకు బుమ్రా తిరువనంతపురం వెళ్లలేదనే విషయం తెలిసిందే. మంగళవారం భారత ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేసినట్లు భారత బోర్డు తన ప్రకటనలో తెలియజేసింది. “Jasprit Bumrah complained of back pain in during India’s practice session on Tuesday. The BCCI Medical Team assessed him. He is ruled out of the first T20I,”అంటూ బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

BCCI వైద్య బృందం, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీతో కలిసి బుమ్రా భవిష్యత్తు గురించి సంప్రదింపులు జరుపుతోంది. బుమ్రాకు ఆపరేషన్ జరుగుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. “అతనికి గాయం మానలేదని మాకు తెలిసింది. ప్రస్తుతానికి అతను భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదని తెలుస్తోంది. వైద్య బృందం త్వరలో నివేదికను అందజేస్తుంది” అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు ధృవీకరించారు. వెన్ను గాయం కారణంగా బుమ్రా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు T20 సిరీస్‌ కు ఫిట్‌ అని ప్రకటించబడ్డాడు. ఈ ఏడాది జూలై నుంచి భారత పేసర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. బుమ్రా గైర్హాజరైతే, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న T20 ప్రపంచకప్‌కు స్టాండ్ బై ప్లేయర్‌లుగా చెప్పబడిన మహ్మద్ షమీ లేదా దీపక్ చాహర్‌లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంటుంది.