SportsUncategorized

జార్వో మూడోసారి.. ఈసారి బౌలర్ గా..!

ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో పిచ్ పైకి ప్రవేశిస్తూ జార్వో 69 సరికొత్త ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయాడు. శుక్రవారం కూడా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లోకి ప్రవేశించి సందడి చేశాడు. యూట్యూబర్ డేనియల్ జార్విస్ అలియాస్ ‘జార్వో 69’ ఆంగ్లేయుడు.. అతడికి భారత క్రికెట్ జట్టు అంటే ఎంతో అభిమానం. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ, ఆ తర్వాత హెడింగ్లీ మ్యాచ్ లోనూ మైదానంలోకి ప్రవేశించాడు. నాల్గవ టెస్టులో కూడా రెండవ రోజు ఆట సమయంలో జార్వో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 33 వ ఓవర్ సమయంలో జార్వో బంతితో పరిగెత్తడం కనిపించింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడానికి భారత స్పీడ్‌స్టర్ ఉమేశ్ యాదవ్ రెడీ అవుతున్న సమయంలో జార్వో దూసుకుని వచ్చి బౌలింగ్ వేశాడు. అంతేకాకుండా నాన్-స్ట్రైకర్ ఎండ్ లో నిలబడి ఉన్న జానీ బెయిర్‌స్టోను జార్వో ఢీకొట్టాడు. ఇప్పటికే ఒక సారి ఫీల్డర్ లాగా.. మరోసారి బ్యాట్స్మెన్ లాగా సందడి చేసిన జార్వో.. ఇప్పుడు ఏకంగా బౌలర్ అవతారం ఎత్తాడు. అంపైర్లు జార్వోను నిలిపివేశారు. ఆ తర్వాత మార్షల్స్ అతడిని ఓవల్ క్రికెట్ మైదానం నుండి బలవంతంగా బయటకు లాక్కుని వెళ్లారు.

డేనియల్ జార్విస్ 2 వ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ వేషం ధరించి లార్డ్స్ క్రికెట్ మైదానంలోకి వెళ్లాడు. అతని ఇండియన్ జెర్సీకి ‘జార్వో 69’ అనే పేరు ఉంది, అతను భారత క్రికెట్ జట్టులో భాగంగా నటించాడు.

ఆగస్టు 27 న, హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన 3 వ టెస్టులో 3 వ రోజు సమయంలో జార్వో భారత జట్టు తరపున బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అతను సాధారణ బ్యాట్స్మెన్ గా మైదానంలోకి వచ్చాడు. పూర్తి క్రికెట్ కిట్ ధరించి.. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చాడు. అప్పుడు కూడా నిర్వాహకులు చూసి అతడిని పక్కకు లాక్కుని వెళ్లారు.

జార్వో 69 ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు. అతను ఇంగ్లాండ్‌లోని కెంట్ కౌంటీలోని గ్రేవ్‌సెండ్ పట్టణానికి చెందినవాడు. డేనియల్ జార్విస్ ప్రాంక్ లు కేవలం క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితమవ్వలేదు. ఎన్నో నగరాల్లో కూడా జార్వో ప్రాంక్ లు చేశాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 7 =

Back to top button