More

    కొండగట్టు కేంద్రంగా పోత్తులపై జనసేనాని కీలక ప్రకటన..!

    జనసేన పార్టీ ప్రచార రథం వారాహి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ రథంలోకి ఎక్కారు. వారాహి పై నుంచి అభిమానులు, జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. కొండగట్టు ఆలయంలో జనసేన పార్టీ అభివృద్ధికి, లోక కల్యాణానికి, కొండగట్టు అంజనేయ స్వామి ఆశీర్వాదం కోరుతూ పార్టీ ప్రచార రథానికి పండితులు పూజలు చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ ను వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు.

    జనసేన ప్రస్తుతానికి బీజేపీతో కలిసే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఎవరు కలిసొస్తారో వారితో కలిసి ముందుకెళతామని అన్నారు. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా ముందుకెళ్తామని అన్నారు. ఎవరు కలిసొచ్చినా, కలిసి రాకపోయినా ముందుకెళ్తామని.. ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా ముందుకెళ్తామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు.

    కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూడడానికి అభిమానులు పోటెత్తారు. జనసేన కార్యకర్తలు, అభిమానుల సందడితో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. ఉదయం 11 గంటలకే పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకోవాల్సి ఉండగా.. ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు.

    Trending Stories

    Related Stories