More

    నవ సందేహాలు వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ వైసీపీ ఎన్నికల హామీల అమలుపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు పై నవ సందేహాలు అంటూ ఓ పోస్ట్ చేశారు. నేడు వైసీపీ ప్లీనరీ మొదలవ్వగా.. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఈ తరహా విమర్శలను ఎక్కుపెట్టారు.

    మొదటి రత్నం రైతు భరోసా: 64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?.. అయితే గత మూడళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700 మందికి మాత్రమే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?

    రెండో రత్నం అమ్మ ఒడి: అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారు.

    మూడో రత్నం పెన్షన్లు: ఏపీలో పెన్షనర్ల జాబితాను కుదించడమే కాదు.. సుమారు 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?

    నాలుగో రత్నం సంపూర్ణ మద్యపాన నిషేధం: ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీనిచ్చారు. మరి మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు, 2021-22లో రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరుకుంది. మరి ఇదేనా మధ్య మద్యపాన నిషేధం అన్నారు. అంతేకాదు మద్యం ఆదాయం చూపించే 8వేల కోట్ల బాండ్లు అమ్మలేదా..?

    అయిదో రత్నం జల యజ్ఞం: పోలవరం ప్రాజెక్టును ‘యుద్ధ ప్రాతిపదిక’ ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?

    ఆరో రత్నం ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సి.ఎమ్.ఆర్.ఎఫ్. నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు.

    ఏదో రత్నం ఫీజు రీయింబర్స్మెంట్: విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు? ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపిస్తున్న మాట నిజం కాదా?

    ఎనిమిదో రత్నం పేదలందరికీ ఇళ్ళు: చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? మరి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు..?

    తొమ్మిదో రత్నం ఆసరా: పొదుపు సంఘాల సంఖ్యను ఏటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి..? అని ప్రశ్నించారు.

    spot_img

    Trending Stories

    Related Stories