More

    మంత్రి దాడిశెట్టి రాజాకు జనసేన వార్నింగ్

    ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, కాకినాడ రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ హెచ్చరించారు. గత రెండు రోజులుగా మంత్రి దాడిశెట్టి రాజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‎పై అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. గురువారం కాకినాడలో తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ జనసేన స్వచ్ఛంద సంస్థలతో కలిపి ప్రజాసేవ,పేదలకు చేయూత అందిస్తోందని అన్నారు. మంత్రి రాజా తన శాఖపై పట్టులేకుండా పవన్ పై విమర్శలు చేయడం దారుణమన్నారు. కనీసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో రోడ్లు వేయడం లేదని మండిపడ్డారు. పవన్‎ కళ్యాణ్‎ను విమర్శించడం ద్వారా తన మంత్రి పదవి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి పవన్ మాట ఎత్తితే సహించేది లేదన్నారు.

    Trending Stories

    Related Stories