Special Stories

తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చిన జనసేన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన క్యాడర్ కాస్త బలపడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే తెలంగాణలో నేడు జనసేన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చింది. తెలంగాణ‌లో ఇటీవ‌ల పోలీసు శాఖ‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి కూడా నోటిఫికేష‌న్ రాగా.. ఉద్యోగార్థుల‌కు రెండేళ్ల పాటు వ‌యో ప‌రిమితిలో సడ‌లింపు ఇవ్వాలంటూ జన‌సేన విద్యార్థి విభాగం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని తెలంగాణ మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ ముందు నిర‌స‌న‌కు దిగింది. క‌రోనా కార‌ణంగా పరిస్థితులు మారడంతో.. మాన‌వ‌తా దృక్ప‌థంతో వ‌యో ప‌రిమితిని స‌డ‌లించాల‌ని ఈ సందర్భంగా జ‌న‌సేన తెలంగాణ విద్యార్థి విభాగం నాయకులు కోరారు. ఇది త‌మ ఒక్కరి డిమాండ్ కాద‌ని, ఉద్యోగాల కోసం సిద్ధ‌ప‌డుతున్న 5 ల‌క్షల మంది నిరుద్యోగుల డిమాండ్ అని జనసేన తెలిపింది.

“తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుళ్లు SI ఉద్యోగ నియామకాల్లో కరోనా కారణంగా 2 సం.రాలు జీవితాలు చిన్నభిన్నం అయిన కారణంగా, మానవతా దృక్పథంతో మరో 2 సం.రాల పరిమితి పెంచాలని 5 లక్షల మంది నిరుద్యోగులకు మద్దతుగా మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన @JanaSenaParty విద్యార్థి విభాగం.” అంటూ ట్విట్టర్ లో ముట్టడికి సంబంధించిన ఫోటోలను జనసేన పోస్ట్ చేసింది.

Related Articles

Back to top button